అయోధ్య రామ మందిరంలో పవిత్రమైన ప్రాణ ప్రతిష్ఠ పవిత్రోత్సవానికి అంతా సిద్ధమైంది. ఆలయ ప్రాంగణం అంతా పూల అలంకరణతో, విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. జనవరి 22 మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య మహా ఆలయ ప్రారంభోత్సవం జరుగనుంది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే హాఫ్ డే సెలవు ప్రకటించింది కేంద్రం.. దీంతోపాటు పలు రాష్ట్రాలు కూడా రామమందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా సెలవు ప్రకటించారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించింది.
ఈక్రమంలో ఉద్యోగుల సెంటిమెంట్, వారి నుంచి వచ్చిన అభ్యర్థనల దృష్ట్యా రామ మందిర ప్రాణ్ ప్రతిష్ట సందర్భంగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలకు జనవరి 22న మధ్యాహ్నం 2.30 గంటల వరకు హాఫ్ డే సెలవును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్: జనవరి 22న అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, లిక్కర్ షాపులను మూసివేయన్నారు. దీపావళి వంటి రోజు లాగా ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి పండగ జరుపుకోవాలని సిఎం యోగి ప్రజలను కోరారు.
గోవా: ఉత్తరప్రదేశ్ మాదిరిగానే గోవాలో కూడా జనవరి 22న ప్రభుత్వ సెలవు ప్రకటించారు. ఈ ప్రత్యేకమైన రోజును దీపావళి మాదిరిగానే ప్రజలు చాలా అనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రజలకు సూచించారు.
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు జనవరి 22న సెలవు దినంగా ప్రకటించారు. అంతేకాకుండా రాష్ట్రంలోని మద్యం, మాంసం దుకాణాలు కూడా మూసివేయబడతాయి.
చత్తీస్‌గఢ్: జనవరి 22న సెలవు ప్రకటించిన రాష్ట్రాలలో చత్తీస్‌గఢ్ కూడా చేరింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
హర్యానా: జనవరి 22 న రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మూసివేయబడతాయని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా ఆ రోజున డ్రై డేగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్ర :జనవరి 22 న అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ వేడుక సందర్భంగా రాష్ట్రంలో పబ్లిక్ హాలిడే ప్రకటించింది మహా రాష్ట్ర ప్రభుత్వం.