అవేర్ నెస్ : రన్నింగ్​ పద్ధతిగా చేయకపోతే కొత్త సమస్యలను తెచ్చుకున్నట్టే

ఫిజికల్ ఫిట్​నెస్​, హెల్దీ లైఫ్​ స్టయిల్​ కావాలనుకునే చాలామందికి రన్నింగ్​ అనేది ముఖ్యమైన ఎక్సర్​సైజ్​. రన్నింగ్​ చేయడం ఈజీ, లాభా​లు కూడా చాలానే ఉన్నాయి. అందుకే ఎక్కువమంది రన్నింగ్​ చేయడాన్ని ఇష్టపడతారు. అది ఓకే కానీ... ఇందులో కొంత రిస్క్​ కూడా ఉంది. రన్నింగ్​ పద్ధతిగా చేయకపోతే కొత్త సమస్యలను తెచ్చుకున్నట్టే అంటున్నారు స్పోర్ట్​ మెడిసిన్​ ఎక్స్​పర్ట్స్​. రన్నింగ్​ చేసేటప్పుడు మరీ ముఖ్యంగా ఓ ఐదు తప్పులు చేయకూడదు. వాటి గురించి తెలుసుకుంటే ప్రాబ్లమ్స్ రాకుండా రన్నింగ్​ను ఎంజాయ్​ చేయొచ్చట!

రన్నింగ్​ చేసేటప్పుడు చేసే కొన్ని తప్పుల వల్ల కీళ్ల మీద ఒత్తిడి పడి... తరువాత పూర్తిగా రన్నింగ్​ మానేయాల్సిన పరిస్థితి వస్తుంది. రన్నింగ్​లో చేసే పొరపాట్ల వల్ల చీలమండ బెణుకు, ఎముకల్లో సన్నటి పగులు, మోకాలి నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఇవేకాక శరీరాన్ని పూర్తిగా కాకుండా ఒక వైపు మాత్రమే వాడడం, వెన్ను నొప్పి వంటివి కూడా తలెత్తుతాయి. ​ఆ ఇబ్బంది లేకుండా ఉండాలంటే చేసే ఆ ఐదు తప్పులను తెలుసుకోవాలి. అప్పుడు కీళ్లు కాపాడుకోవచ్చు. నొప్పులు లేకుండా పరిగెత్తొచ్చు.

పెద్ద అంగలు వేయడం

పరిగెత్తేటప్పుడు అంగలు ఎక్కువ దూరం వేయడం వల్ల మోకాళ్ల మీద ఎఫెక్ట్​ పడుతుంది. దాంతో కీళ్ల మీద ఒత్తిడి పడుతుంది. అయినా పట్టించుకోకుండా అలానే పరిగెత్తితే కొన్నాళ్లకు మోకాళ్ల మీద పడే ఒత్తిడి ఆర్థరైటిస్​కు, కీళ్ల క్షీణత​కు కారణం అవుతుంది. ఆ రిస్క్​ లేకుండా ఉండాలంటే పెద్ద పెద్ద అంగలు వేయొద్దు. పరిగెత్తేటప్పుడు ఎంత అంగ పడుతుందో అంతే వేయాలి. దానికి మించి చేయకూడదు.

నొప్పిని నిర్లక్ష్యం చేయడం

రన్నింగ్​ చేసేవాళ్లు చేసే కామన్​ మిస్టేక్... రన్నింగ్​ చేసేటప్పుడు అసౌకర్యంగా ఉన్నా పట్టించుకోకపోవడం. నొప్పిని పట్టించుకోకపోతే దీర్ఘకాలిక కీళ్ల నొప్పిని పట్టించుకోనట్టే. అందుకే రన్నింగ్​ చేసేటప్పుడు లేదా రన్నింగ్​ చేశాక అసౌకర్యంగా అనిపిస్తే శరీరం హెల్త్​ అలారమ్​ మెసేజ్​ ఇస్తున్నట్టు. దాన్ని పట్టించుకోవాలి. వెంటనే మెడికల్​ అడ్వైజ్​ తీసుకోవాలి.

వామప్స్​, కూల్​ డౌన్స్​ చేయకపోవడం

రన్నింగ్​కు ముందు వామప్​, ఆ తరువాత కూల్​ డౌన్​ ఎక్సర్​సైజ్​లు చేయాలి. అలా చేయకపోతే కీళ్ల గాయాలకు మీరే కారణం అవుతారు. రన్నింగ్​ చేశాక చేసే స్ట్రెచెస్​ వల్ల రికవరీ, ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి. కీళ్ల దగ్గర స్ట్రెయిన్​ కాకుండా ఉంటుంది. డైనమిక్​ స్ట్రెచెస్​​ చేయడం, రన్నింగ్ కంటే ముందు చేసే మొబిలిటీ ఎక్సర్​సైజ్​ వల్ల కీళ్లు మీరు చేసే యాక్టివిటీకి రెడీ అవుతాయి. ఆ తరువాత ఇబ్బంది పెట్టవు.

పూర్​ రన్నింగ్​

రన్నింగ్​ చేసేటప్పుడు మీ శరీరం మరీ ముఖ్యంగా కాళ్లు, పాదాలు ఎలా కదులుతున్నాయి అనేదానిమీద దృష్టి పెట్టాలి. అవేవీ చూసుకోకుండా సరిగా రన్నింగ్​ చేయకపోతే కీళ్ల మీద అదనపు ఒత్తిడి పడుతుంది. దానివల్ల ఇంజ్యురీ రిస్క్​ పెరుగుతుంది. పాదాన్ని నేల మీద ఆన్చేటప్పుడు పాదం మడమ బయటి నుంచి లోపలికి ఎంత వరకు పడుతుంది అనేది గమనించాలి. దీన్ని స్పోర్ట్స్​ భాషలో  ఓవర్​ ప్రొనేషన్​ అంటారు. అలాగే శరీరం ఎలా వంచుతున్నారో చూసుకోవాలి. ఇది హంచింగ్​ ఓవర్ అన్నమాట. అంటే రన్నింగ్​ చేసేటప్పుడు భుజాలు, వెన్నెముక ఎలా బెండ్​ చేస్తున్నారనేది ముఖ్యం.

అలాగే హీల్​ స్ట్రైకింగ్​ అంటే... పాదాన్ని నేలమీద ఆన్చేటప్పుడు మొదట నేలమీద మడమ పెడితే అప్పుడు శరీరం బరువు అంతా మడమ మీదే పడుతుంది. రన్నింగ్​ చేసేటప్పుడు ఈ సమస్యలు గమనిస్తే వాటిని సరి చేసుకున్న తరువాతే రన్నింగ్​ చేయాలి. అందుకు ఫిజియోథెరపిస్ట్​ లేదా రన్నింగ్​ కోచ్​తో మాట్లాడాలి.

సరైన ఫుట్​వేర్​ వాడకపోవడం

ఫిట్ కాని లేదా పాదానికి సపోర్ట్​ చేయని షూస్​ వేసుకుంటే కీళ్ల మీద ఒత్తిడి పెరుగుతుంది.  ఫ్లాట్​ సోల్​ ఉన్న జీరో డ్రాప్​ షూస్​ వేసుకోవాలి. ఇవయితే పాదాలకు ఏవీ వేసుకోకుండా నడిస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్​ ఇస్తాయి. దానివల్ల అడుగు కదలిక, భంగిమ రెండూ సహజంగా ఉంటాయి. జీరో డ్రాప్​ లేదా మినిమలిస్ట్​ రన్నింగ్ షూస్​కి నెమ్మదిగా మారాలి. అలా అయితేనే గాయాలు అయ్యే అవకాశం తగ్గుతుంది.

ఫిట్​నెస్​ కోసం రన్నింగ్​ చేసే వాళ్లయినా, స్పోర్ట్స్​ కోసం ప్రాక్టీస్​ చేసే వాళ్లయినా​ పర్​ఫార్మెన్స్​ మెరుగుపడాలంటే వారానికి ఒకసారి టెంపో రన్స్​ చేయాలి. టెంపో రన్​ వల్ల వేగంగా, ఎక్కువ దూరం పరిగెత్తే సామర్ధ్యం మెరుగుపడుతుంది.

ఇక్కడ చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే రన్నింగ్​ ఎంజాయ్​ చేయొచ్చు. అయితే రన్నింగ్​ చేసేటప్పుడు, చేసిన తరువాత నొప్పులు అదేపనిగా వస్తుంటే కనుక మెడికల్​ సలహా అనేది చాలా అవసరం. అలాగే పర్సనల్​ గైడెన్స్​ తీసుకోవాల్సి ఉంటుంది.