48 సార్లు రక్తదానం చేసిన దాతకు అవార్డు 

ఎల్లారెడ్డిపేట,వెలుగు: 48 సార్లు రక్తదానం చేసిన రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డికి అవార్డు దక్కింది. శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో రాజ్ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం చేతుల మీదుగా గిరిధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి అవార్డుతో పాటు ప్రశంసాపత్రం అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ చైర్మన్ అజయ్ మిశ్రా, మదన్ మోహన్, తదితరులు  పాల్గొన్నారు.