మీరు ఏ విషయాన్నీగుర్తుంచుకోలేకపోతున్నారా..ఏకాగ్రత కుదరడం లేదా..? చిరాకుగా ఉంటుందా? సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారా? మీరు తార్కికంగా ఆలోచించే, నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారా.. అయితే ఇవన్నీ మీకై మీరు కొని తెచ్చుకున్నవే..అదెలా అంటే..మనకున్న కొన్ని అలవాట్లే ఈ దుష్ఫలితాలను పెం చి పోషిస్తాయి. ఈ దుష్ప్రభావాలను కలిగించే కొన్ని రకాల అలవాట్ల గురించి మనం తెలుసుకుందాం..
కొంతమందికి బయటకు వెళ్లడం అంటే ఇష్టం ఉండదు. మరికొంతమంది ఓ చీకటి రూంలో ఓ మూలన కూర్చొవడమో..పడుకోవడానికో ఇష్టపడతారు. ఇంకొంత మంది ఏంచేయాలో తోచడం లేదంటూ పెద్ద సౌండ్ పెట్టుకొని హెడ్ ఫోన్ లో మ్యూజిక్ వింటుంటారు.. ఇవన్నీ మన మెదడు పై ప్రభావం చూపుతాయని కొన్ని అధ్యయనాలు చెపుతున్నాయి. మరి ఇలాంటి అలవాట్లను ఎలా మానుకోవాలి.. మెదడు యాక్టివ్ గా పని చేయాలంటే ఏం చేయాలి అనే అంశాలను తెలుసుకుందాం.
నిద్రలేమి..
నిద్రలేమి..ఇది మెదడుకు తీవ్ర నష్టం కలిగించే సమస్యల్లో ఒకటి. పెద్దలకు తగినంత నిద్ర అంటే రోజుకు ఏడునుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని న్యూరాలజీస్టులు చెపుతున్నారు. రాత్రి పూట నిద్ర పోతే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు. నిద్ర పోగానే మెదల విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే మెదడు కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. కనీసం ఏడు గంటలు నిద్రపోకపోతే కొత్త కణాలు ఏర్పడవు. ఫలితంగా మీరు ఏ విషయాన్నీ గుర్తుంచుకోలేరు. ఏకాగ్రత ఉండదు. చిరాకు, నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు ఉందంటున్నారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల మెదడుకు చాలా నష్టం జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్ నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది.
బ్రేక్ ఫాస్ట్ ..
రాత్రంతా పడుకొని ఉంటా కాబట్టి ఏం తినం..ఉదయాన తినే బ్రేక్ ఫాస్ట్ మనకు రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుందట. మనలో చాలా మంది ఉదయాన బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోతాయి. ఫలితంగా మెదడుపై ప్రభావం పడుతుంది. పోషకాల లోపం వల్ల మెదడులో సామర్థ్యం తగ్గిపోయి మెదడు పనితీరు దెబ్బతింటుందంటున్నారు.
సరిపడా నీరు తాగకపోతే..
మెదడులో 75 శాతం నీరుంటుంది. మెదడు సామర్థ్యం మేరకు పని చేయాలంటే తగినంత నీటితో హైడ్రేటెడ్ గా ఉంచడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తగినంత నీరు తాగకపోతే మెదడు పనితీరులో తేడా వస్తుంది. కణజాలం కుంచించుకుపోతుంది. కణాల పనీతీరు క్షీణిస్తుంది. దీంతో తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. మీ వయస్సు, బరువు, వాతావరణ పరిస్థితులు, జీవన విధానం బట్టి నీటినీ తగిన మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఒత్తిడి
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు కణాలు చనిపోతాయి. మెదడు ముందు భాగం కుంచించుకుపోతుంది. ఇది జ్ణాపక శక్తి, ఆలోచన శక్తిని కోల్పోయేలా చేస్తుందని సూచిస్తున్నారు. పనిలో పడితే ఎవరు చెప్పినా చేయడం.. నో అని చెప్పకుండా పనిచేయడం వల్ల ఎక్కువ ఒత్తిడికి గురవుతారు. ఈ తీరును వెంటనే మార్చు కోవాలి. అనారోగ్యంగా ఉన్నప్పుడు పనిచేయడం మానుకోవాలి.. లేదంటే మెదడుపై ఒత్తిడి పడుతుంది. అనారోగ్యాన్ని సరిచేసే పనిలో మెదడు ఉంటుందని కాబట్టి అదనంగా ఒత్తిడి పెంచొద్దనంటున్నారు.
ఒంటరిగా ఉండటం..
చాలామంది ఇతరులను కలిసేందుకు ఎక్కువగా ఇష్టపడరు. ఎప్పుడూ ఒంటరిగా ఉండటం, ఇతరులతో మాట్లాడకపోవడం లాంటివి చేస్తుంటారు.. ఇవి మెదడుకు హానీ చేస్తాయి. ఇతరులతో మాట్లాడటం మెదడు ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం. ఒంటరి తనం వల్ల డిప్రెషన్, యాంగ్జైటీ , అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. మెదడు ఆరోగ్యం బాగుపడాలంటే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో తరచు తగినంత సమయాన్ని గడపాలి. సానుకూలంగా వ్యక్తులతో ఎక్కువ టైం స్పెండ్ చేయాంటున్నారు ఆరోగ్య నిపుణులు.