Good Health : మీ ఊపిరితిత్తులు బాగుండాలంటే.. ఈ 5 అలవాట్లు మానుకోండి..!

మనిషి ఆరోగ్యంగా ఉండటానికి గుండె పనిచేయటం ఎంత ముఖ్యమో.. ఊపిరి తిత్తులు సక్రమంగా పనిచేయటం కూడా అంతే ముఖ్యం. శరీరానికి ఆక్సిజన్ ను అందించటమే కాకుండా..రక్తంలోని టాక్సిన్స్ ను ఫిల్టర్ చేసి ప్యూరిఫై చేస్తుంది. అయితే, మన రోజువారీ అలవాట్ల కారణంగా ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతింటుంది. లంగ్స్ డ్యామేజ్ అయితే వెంటనే తెలిసే అవకాశాలు చాలా తక్కువ. సమస్య ఎక్కువైన తర్వాత మనిషిని మంచానికే పరిమితమయ్యేలా చేసి తీవ్ర ఇబ్బందికి గురి చేస్తాయి లంగ్స్ డిసీజెస్.

ఊపిరితిత్తులు బాగుండాలంటే ఈ 5అలవాట్లు మానుకోండి:

స్మోకింగ్:

సిగరెట్ స్మోకింగ్ వల్ల లంగ్స్ డ్యామేజ్ వస్తాయని అందరికీ తెలిసిందే. అయినప్పటికీ మనలో చాలా మంది స్మోకింగ్ అలవాటును మానెయ్యలేకపోతుంటాం. కానీ, స్మోకింగ్ వల్ల మన లంగ్స్ పాడవ్వటం మాత్రమే కాదు మన పక్కన ఉన్నవారికి కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి ఊపిరితిత్తులు బాగుండాలంటే వెంటనే స్మోకింగ్ మానెయ్యండి. స్మోకింగ్ అలవాటు లేకపోయినా స్మోక్ చేసేవారికి దూరంగా ఉండి మీ  లంగ్స్ ను కాపాడుకోండి.

పొల్యూషన్ కి దూరంగా ఉండండి:

ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం వల్ల లంగ్స్ డిసీజెస్ బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. ఈరోజుల్లో కాలుష్యానికి దూరంగా ఉండటం సాధ్యం కాని పని కాబట్టి, మాస్క్ ధరించటం వంటి కనీస జాగ్రత్తలు తీసుకుంటే మన లంగ్స్ ని కాపాడుకోవచ్చు.

Also Read :- పిల్లలకు వీళ్లు చాలా ఇంపార్టెంట్

వ్యాయామం చేయండి:

వ్యాయాయం చేయకపోవటం వల్ల కూడా లంగ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయాయం చేసి ఊపిరితిత్తులను కాపాడుకోండి.

దగ్గును నిర్లక్ష్యం చేయకండి:

జలుబు, దగ్గును మనలో చాలమంది లైట్ తీసుకుంటూ ఉంటాం. దగ్గు దీర్ఘకాలంగా ఉంటే టీబీకి దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి దగ్గును నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త తీసుకోండి.

బ్రీతింగ్ వ్యాయామాలు అలవాటు చేసుకోండి:

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే బ్రీతింగ్ వ్యాయామాలు క్రమం తప్పకుండా చేయాలి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగు పరుస్తాయి.