యాదాద్రి కొండపైకి ఆటోల అనుమతి

యాదగిరిగుట్టపైకి  ఈరోజు(ఫిబ్రవరి 11) నుంచి ఆటోలు నడువనున్నాయి.  ఆదివారం ఉదయం 10 గంటలకు  పచ్చజెండా ఊపి  ఆటోల రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదగిరిగుట్ట ప్రధానాలయం రీఓపెన్ సందర్భంగా గత ప్రభుత్వం.. 2022 మార్చి 28న కొండపైకి ఆటోలను నిషేధించింది. దీంతో  ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఘాట్ రోడ్డు సమీపంలో యాదరుషి విగ్రహం వద్ద దాదాపుగా 20 నెలల పాటు దీక్షలు కొనసాగించారు. 

ALSO READ :- SA20, 2024: మనోళ్లదే కప్: వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న సన్ రైజర్స్

అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు 2023 నవంబర్‌‌‌‌లో దీక్షలు విరమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆటో డ్రైవర్లు, ఆలయ ఉద్యోగులు, పోలీసులతో పలు దఫాలుగా రివ్యూలు చేశారు. సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. ఈ నెల 11 నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటో డ్రైవర్ల రెండు సంవత్సరాల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది.