Australia Social Media ban: పేరెంట్స్ కళ్లలో ఆనందం కోసం.. అక్కడ టీనేజర్లకు సోషల్ మీడియా నిషేధం

సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో కంటెంట్ ప్రభావం పిల్లలు, యువతపై ఎక్కువగా ప్రభావం పడుతుండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టిక్ టాక్ ఇలా అనేక రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫాం లద్వారా మిస్ లీడ్ కంటెంట్ వ్యాప్తి బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ కంటెంట్ ప్రభావం పిల్లలు,టీనేజర్లపై బాగా ఉంది.  

అయితే ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా దేశాలు సన్నాహాలు ప్రారంభించాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫాం లపై నిషేధం విధిస్తున్నాయి.

16 యేళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియా వినియోగించకుండా ఉండేందుకు ఆస్త్రేలియా ప్రభుత్వం రెడీ అవుతోంది. పిల్లల మానసిక ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకొని పిల్లలపై సోషల్ మీడియా ప్రభావంపై పెరుగుతున్న ఆందోళనకు పరిష్కారం కోసం చట్టం తీసుకొస్తుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఆ దేశ ప్రధాని అల్బనీస్ చెబుతున్నారు. 

ప్రధాని స్టేట్ మెంట్ ఏంటంటే..

16 యేళ్ల లోపు పిల్లల కోసం సోషల్ మీడియాను నిషేధించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఆన్ లైన్ లో పిల్లలను ప్రభావితం చేసే అంశాలనుంచి వారిని రక్షించడం మా బాధ్యత.. ఇది అమ్మలు, నాన్నలకోసం.. చాలా మంది ఆన్ లైన్ లో పిల్లల భద్రతపై ఆందోళనతో ఆనారోగ్యం బాధపడుతున్నారు. వారికి అండగా ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలి’’ అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ అన్నారు. 

ఈ నిషేధం ప్రకారం.. 16 యేళ్ల లోపు పిల్లలు వారి సైట్ లను యాక్సెస్ చేయకుం డా నిరోధించేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం లు చర్యలు చేపట్టాలి. పేరెంట్స్ అనుమతి ఉన్నా కూడా వారికి ఎలాంటి మినహాయింపు ఉండవు. సైట్ల యాక్సెస్ పై పూర్తి బాధ్యత సోషల్ మీడియా కంపెనీలదే అని ప్రధాని చెప్పారు. 

అయితే టీనేజర్లకు సోషల్ మీడియా నిషేధంపై కొంతమంది పేరెంట్స్, న్యాయవాదులు స్వాగతించినప్పటికీ నిషేధం ప్రభావవంతంగా ఉంటుందని నిపుణులు విశ్వసించడం లేదు. యాక్సెస్ పరిమితం వల్ల ఆన్ లైన్ హానికరమైన కంటెంట్ నిరోధించడం కంటే.. సోషల్ మీడియాకు పిల్లలను దూరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాదిస్తున్నారు.