నవీపేట్​లోని..ఏటీఎంలో చోరీకి యత్నం

నవీపేట్, వెలుగు: నవీపేట్​లోని మహేశ్​కంప్లెక్స్ లో ఉన్న ఎస్​బీఐ బ్యాంక్​ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎం మెషిన్ డోర్లు తెరిచి, లాకర్ ను బద్ధలు కొట్టే ప్రయత్నం చేశారు. అలారం మొగి హెడ్ ఆఫీస్ కు సమాచారం చేరడంతో స్థానిక పీఎస్​కు సమాచారం అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే ఇద్దరు నిందితులు పల్సర్ బైక్ పై పరారీ అయ్యారు.