బషీర్ బాగ్, వెలుగు: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ వీహెచ్‌పీ, భజరంగ్ దళ్, ఇస్కాన్, భారత్ స్వాభిమాన్ సంస్థల ప్రతినిధులు హైదరాబాద్ లో శనివారం మానవహారం చేపట్టారు. ఇస్కాన్ స్వామి చిన్మయ్ కృష్ణదాస్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్‌లోని మైనార్టీలకు యావత్ భారతదేశం అండగా నిలుస్తుందన్నారు. వారి రక్షణకు అంతర్జాతీయ సమాజం కూడా బంగ్లా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్ పీ జాతీయ అధికార ప్రతినిధి డా. రావినూతల శశిధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సునీతా రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.