ఇజ్రాయెల్‌‌‌‌పై దాడి చేయండి

  •     ఇరాన్​ ఆర్మీకి ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఆర్డర్స్
  •     హనియా హత్యకు ప్రతీకారంగానే దాడులకు ఆదేశాలు

టెహ్రాన్: హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్​పై ప్రత్యక్ష దాడులు చేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఆ దేశ ఆర్మీకి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఈ అంశా న్ని ముగ్గురు ఇరాన్ అధికారులతో పాటు ఇద్దరు రెవల్యూషనరీ గార్డ్స్ కూడా కన్ఫర్మ్ చేశారని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. 

బుధవారం హనియా హత్య జరి గిన కొద్ది సేపటికే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించి. ఇజ్రాయెల్​పై దాడి చేయాలని సైన్యానికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పటికే ఇజ్రాయెల్, హైఫా సమీపంలోని సైనిక లక్ష్యాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడికి ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇరాన్ సైనిక కమాండర్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. మిడిల్ ఈస్ట్‌‌లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో లెబనాన్‌‌లోని ఇండియన్స్ ఆ దేశం విడిచి వెళ్లాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. అత్యవసరమైతే బీరూట్‌‌లోని భారత ఎంబసిని సంప్రదించాలని గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.