బెంగాల్ ఘటన మరవకముందే .. బెంగళూరులో లిఫ్ట్ అడిగిన యువతిపై అత్యాచారం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో లేడీ డాక్టర్ రేప్ , మర్డర్ ఘటన మరవకముదే కర్నాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం జరిగింది. లిఫ్ట్ అడిగిన యువతి పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ బైకర్. 

రమంగళలో గెట్ టు గెదర్ కు హాజరైన యువతి...హెబ్బగోడిలోని ఇంటికి వెళ్తుండగా ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు ఇప్పటికే ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కేసు దర్యాఫ్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు పోలీసులు.