అద్దె కట్టట్లేదని.. ఏటీఎం సెంటర్ కు లాక్

కరీంనగర్, వెలుగు: రూమ్ అద్దె చెల్లించలేదని ఏటీఎం సెంటర్ కు ఓనర్ తాళం వేశాడు. కరీంనగర్ టౌన్ కమాన్ చౌరస్తా నుంచి హౌసింగ్ బోర్డ్ కాలనీ వెళ్లే రోడ్డులోని ఏటీఎం సెంటర్ కు ‘ క్లోజ్డ్ డ్యూ టూ నాన్ పేమెంట్ ఆఫ్ హౌజ్ రెంట్(రెంట్ చెల్లించని కారణంగానే మూసివేశాం)’ బోర్డు తగిలించి సోమవారం కనిపించింది.

 దీంతో క్యాష్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లినా ప్రజలు‌ బోర్డు చూసి తిరిగి వెళ్తున్నారు. ఈ‌ ఏటీఎం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.