న్యూఢిల్లీ:ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషీ పేరు ఖరారు కావడంతో కేజ్రీవాల్ రాజీనామాపై ఆసక్తి నెలకొంది. ఉత్కంఠకు తెరిదించుతూ సెప్టెంబర్ 17 సాయంత్రం 4.30 గంటలకు కేజ్రీవాల్ రాజీ నామా చేయనున్నారు.లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు.
మంగళవారం కేజ్రీవాల్ నివాసంలో సమావేశం అయిన ఆప్ నేతలు, ఎమ్మెల్యేలు సమావేశ మయ్యారు. కేజ్రీవాల్ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న అతిషీని ప్రతిపాదించారు. అతీషిని సీఎంగా కేజ్రీవాల్ ప్రతిపాదననను ఆమోదిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నిర్ణయాన్ని తెలిపారు.
Also Read:-జియో నెట్వర్క్ ఢమాల్
గత రెండు రోజులు క్రితం జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్.. 48 గంటలలోపు సీఎం పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆప్ ప్రభుత్వం నిజాయితీగల ప్రభుత్వమా కాదా అని ఢిల్లీ ప్రజ లు నిర్ణయించుకునేలా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు పిలుపునిచ్చారు.
మరోవైపు అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు నేను కూడా పీపుల్స్ కోర్టుకు వెళ్తాను. ఎన్నికల్లో నా నిజాయితీని ప్రజలు ఆమోదిస్తే అప్పుడే నేను కుర్చీలో కూర్చుంటాను అని మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు.