కరీంనగర్ టౌన్,వెలుగు : సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ చైర్మన్, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. గతంలో జిల్లాలో 2సార్లు రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలను నిర్వహించామని తెలిపారు. బాలుర విభాగంలో అండర్14 వి.గౌతమ్ఎం
.నాగసాయి, అండర్ 16 ఎస్ఆర్ లికిల్ అనిష్, అండర్ 18 విభాగంలో వి.హృతికేష్, బి.నిషద్జ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.మధుసూధన్ రెడ్డి, జిల్లా బాధ్యులు ఎన్. వేణుగోపాల్, ఇనుగుర్తి రమేశ్, అరవింద్ బాబు, ఆన్వేష్ పాల్గొన్నారు.