సెబీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

ముంబయిలోని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్‌‌‌‌ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వివిధ స్ట్రీమ్‌‌‌‌లలో 97 ఆఫీసర్ గ్రేడ్ -ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత : సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌బీ/ పీజీ/ సీఏ/ సీఎఫ్‌‌‌‌ఏ/ సీఎస్‌‌‌‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు మార్చి 31 నాటికి 30 ఏళ్లు మించకూడదు. నెలకు రూ.44,500 నుంచి రూ.89,150 జీతం చెల్లిస్తారు.

సెలెక్షన్ ​: ఫేజ్-1, ఫేజ్-2 (పరీక్షలు), ఫేజ్-3 (ఇంటర్వ్యూ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తులు : అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్​ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అన్‌‌‌‌రిజర్వ్‌‌‌‌డ్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్‌‌‌‌ వారికి రూ.1000 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఫేజ్-I ఆన్‌‌‌‌లైన్ పరీక్ష  జులై 27, ఫేజ్-II ఆన్‌‌‌‌లైన్ పరీక్ష  ఆగస్టు 31,  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ ఫేజ్-II పేపర్-2 పరీక్ష అక్టోబర్​14-న  నిర్వహించనున్నారు. వివరాలకు www.sebi.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.