మునుగోడు మండలంలో రైతును కొట్టిన ఏఎస్సై .. వైరల్‌‌‌‌గా మారిన వీడియో

  • భూ వివాదంలో ఇద్దరు రైతుల మధ్య గొడవ
  • రైతును స్టేషన్‌‌‌‌కు తీసుకెళ్లేందుకు వచ్చి దాడి చేసిన ఏఎస్సై

మునుగోడు, వెలుగు : ఇద్దరు రైతుల మధ్య భూ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ఏఎస్సై ఓ రైతును కుటుంబ సభ్యుల ముందే కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌గా మారింది. మునుగోడు మండల కేంద్రానికి చెందిన ముత్యాలుకు, మరో రైతు భూ వివాదంలో గొడవ పడ్డారు. దీంతో సదరు రైతు ముత్యాలుపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

ఈ క్రమంలో సుమారు 20 రోజుల కింద మునుగోడు ఏఎస్సై కోటి సింగ్‌‌‌‌ ముత్యాలు వద్దకు వెళ్లి పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు రావాలని చెప్పాడు. అయితే తాను పొలం పనుల్లో ఉన్నానని, తర్వాత స్టేషన్‌‌‌‌కు వస్తానని ముత్యాలు ఏఎస్సైతో చెప్పాడు. దీంతో ఆగ్రహించిన కోటి సింగ్‌‌‌‌ ముత్యాలపై దాడి చేశాడు. కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఏఎస్సై శాంతించాడు. వృద్ధుడని కూడా చూడకుండా ముత్యాలుపై దాడి చేసిన ఏఎస్సై కోటి సింగ్‌‌‌‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌గా మారిన వీడియోను చూసిన ప్రజలు ఏఎస్సైపై ఆగ్రహం వ్యక్తం చేస్త్నునారు.