బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకుని జీవక్రియపై శ్రద్ధ చూపకపోతే, రుచికరమైన ఆహారాన్ని వండడమే లక్ష్యంగా పెట్టుకుని ఉప్పుపై శ్రద్దం చూపనట్లే. అవును, మీ బరువు పెరగడమనేది మీ జీవక్రియకు సంబంధించినది. శరీరంలో జీవక్రియను పెంచడం వల్ల, మీ శరీర బరువు వేగంగా తగ్గుతుంది. ఇది మాత్రమే కాదు, మీ జీవక్రియ మెరుగ్గా ఉంటే.. జీర్ణక్రియ ప్రక్రియ కూడా మెరుగ్గా పని చేస్తుంది, మీ రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. అంతేకాదు, మెటబాలిజం మెరుగ్గా ఉండటం వల్ల, శరీరానికి కావలసిన శక్తి అందుతుంది. శ్వాస తీసుకోవడం నుండి ఆహారం జీర్ణం చేయడం వరకు అన్నీ కూడా సరైన జీవక్రియ ద్వారానే జరుగుతాయి. కావున జీవక్రియను బలంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ బాధ్యతను నెరవేర్చడానికి, మీరు ఈ కింది 6 ఆయుర్వేద మూలికలను తినవచ్చు.
అశ్వగంధ:
మీ రోజూ వారి ఆహారంలో అశ్వగంధ పొడిని కలిపి తినడం ద్వారా, మీ బరువును చాలా త్వరగా తగ్గించవచ్చు. అంతేకాకుండా, అశ్వగంధ టీ తాగడం వల్ల మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. ఇది కాకుండా, రక్తంలో చక్కెర, ఒత్తిడిని తగ్గించడంలోనూ అశ్వగంధ సాటిలేనిది. ఇది మీకు మంచి నిద్రను పొందడంలోనూ సహాయపడుతుంది. అంతే కాదు, అశ్వగంధ జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు దీన్ని తప్పనిసరిగా తీసుకోవాలి.
ఉసిరికాయ:
రోజూ ఉసిరికాయ తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా చర్మ సంబంధిత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఉసిరికాయ తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీవక్రియ మెరుగ్గా పనిచేస్తుంది, బరువు వేగంగా తగ్గవచ్చు, రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి.
అతిమధురం :
రోజూ అతిమధురంను తినడం వల్ల బరువు అదుపులో ఉండడమే కాకుండా జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా, దీని వినియోగం ఒత్తిడి, బలహీనమైన జ్ఞాపకశక్తి వంటి మానసిక సమస్యల నుండి కూడా మిమ్మల్ని దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
జాజికాయ:
జాజికాయను సాధారణంగా మసాలాలో ఉపయోగిస్తారు. దీన్ని రోజూ తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు మంచి గాఢ నిద్ర వస్తుంది. అంతే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఇది రక్షిస్తుంది.
శతావరి:
శతావరిని ఆయుర్వేద ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇది స్టెరాయిడ్ సపోనిన్లు, ఫ్లేవనాయిడ్స్ అని పిలువబడే మూలకాలను కలిగి ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడానికి పని చేస్తాయి. దీని ఉపయోగం రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, జీవక్రియను మెరుగుపరుస్తుంది.
ఓమ లేదా వాము:
ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే డయాబెటిక్ రోగులకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది.