Ashok Galla: మురారి తరహాలో మహేష్ మేనల్లుడి వాసుదేవ.. ఆసక్తిరేపుతున్న ట్రైలర్

మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన  చిత్రం ‘దేవకీ  నందన వాసుదేవ’. మానస వారణాసి హీరోయిన్. ప్రశాంత్ వర్మ కథను అందించగా  ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించాడు. సోమినేని బాలకృష్ణ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో తాజాగా దేవకీ నందన వాసుదేవ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ భూమి మీద ఎక్క‌డా లేని విధంగా సుద‌ర్శ‌న చ‌క్రంతో వాసుదేవుడి విగ్ర‌హం ఉందని చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ స్టార్ట్ అయింది. ఈ ఒక్క సంవంత్సరం జాగ్రత్తగా ఉండు నాన్న.. జాతకంలో ఏదో ఇబ్బంది ఉందంట అని వాళ్ళ అమ్మతో చెప్పడంతో మురారి సినిమా గుర్తొచ్చేలా ఉంది.

ఆ తర్వాత లవ్ ట్రాక్ బ్యూటీఫుల్ ఫీల్ ఇచ్చేలా ఉంది. నా దగ్గర చాలా స్వేచ్ఛ ఉంది.. అని హీరో హీరోయిన్ తో చెప్పే డైలాగ్ బాగుంది. నీ మరణ గండం నీ ఇంటనే పుడుతోంది. శ్రీకృష్ణుడి పుట్టుక మేనమామ కౌంసుడి మరణానికి కారణం అయినట్లు, ఈ సినిమాలో హీరో పుట్టుక అతడి మేనమామకు ప్రాణ గండం కానుందంటూ  పూజారి చెప్పే డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. 

ఇంతకీ మేనల్లుడు, మేనమామ మధ్య వివాదం ఎక్కడ మొదల అవుతుంది? వంటి ఆసక్తికర అంశాలతో ట్రైలర్ సాగింది. దాంతో మురారి తరహాలో దైవ కోణంతో ఉన్న కుటుంబ కథగా ఈ మూవీ తెరకెక్కిన్నట్లు అర్ధమవుతోంది. అశోక్ గల్లా యాక్ష‌న్ స‌న్నివేశాలు బాగున్నాయి. 'ఆదిపురుష్'లో హనుమంతుడిగా చేసిన దేవదత్తా.. ఇందులో విలన్‌గా చేశాడు.

ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. కాగా ఈ మూవీ న‌వంబ‌ర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.‘హీరో’ చిత్రంతో  టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా.. ఇప్పుడు ‘దేవకీ నందన వాసుదేవ’ తో ఎలాంటి సక్సెస్ అందుకోనున్నాడో చూడాలి.