వామ్మో... స్మశానంలో దొంగతనం.. అస్థికలు చోరీ.. ఎందుకంటే..

వరంగల్ జిల్లాలో కొంతమంది దుండగులు క్షుద్ర పూజలు కోసం స్మశానంలో అస్థికల చోరీకి పాల్పడ్డారు.  అమావాస్య రోజున క్షుద్రపూజలు చేసేందుకు భీమారం స్మశాన వాటికలో ఖననం చేసిన మృత దేహాల అస్థికలను అపహరిస్తున్న వ్యక్తిని మృతుడి బంధువులు పట్టుకున్నారు.  విషయం తెలుసుకున్న స్థానికులు ఎవరికి ఏమి అవుతుందోనని భయపడుతున్నారు. 

ALSO READ : హైదరాబాద్‎లో రూ.500 కోసం హత్య

ఆగంతకులు రెండు మృత దేహాల అస్థికలను అపహరించేందుకు ప్రయత్నం చేశారు.  అయితే అంత్యక్రియల సమయంలో నోట్లో బంగారం పెడతారు.  దానిని తీసుకొనేందుకు ఖననం చేసిన మృత దేహాలను వెలికితీశామని దొంగలు చెబుతున్నారు.  తాము ఎలాంటి క్షుద్ర పూజలు చేయడం లేదన్నారు.  ఏది ఏమైనా స్మశాన వాటికలను టార్గెట్ చేసుకొన్న ఈ వింత దొంగలు జనాలకు దడ పుట్టిస్తారు.