బోనాలు స్పెషల్ : ఆషాఢం మైదాకు(గోరింటాకు) పండుగ.. అరచేతి నిండా ఎర్రగా పండింది..!

"గోరింటా పూచింది...కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గా తొడిగింది.. ఎంచక్కా పండేనా.. ఎర్రన్ని చుక్క.. చిట్టీ పేరంటానికి శ్రీరామ రక్ష.." గోరింటాకు సినిమాలో పాట ఇది. మైదాకు అంటే అడపిల్లలకు ఎంతో ఇష్టం. పెళ్లైనా.. పేరంటం అయినా చేతులకు మైదాకు ఉండాల్సిందే. తెల్లారి లేచి... ఎర్రగా పండిన చేతులను అందరికీ చూపించి మురిసిపోవాల్సిందే. 

కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పటివాళ్లకూ చేతుల్లో, కాళ్ల మీదా మైదాకును పండించడం ఇష్టమే అయినా.. కోయడం, నూరడం, పెట్టుకో వడం కాస్త కష్టం. అందుకే ఇన్స్టంట్ గా దొరుకు తున్న కోన్నే ఎక్కువగా వాడుతున్నారు. చాలా మందికి మైదాకు విశిష్టత తెలియదు. దీనిలో బోలెడు ఔషధ గుణాలు ఉన్నాయనే విషయం. ఇప్పటి తరం అమ్మాయిలకు చెప్పాలని చాలా పట్టణాల్లో ఆషాఢంలో మైదాకు పండుగలు. చేస్తున్నారు.

ఆషాఢం వచ్చిందంటే చాలు... ఆడవాళ్ల చేతులు మైదాకు(గోరింటాకు)తో చూడముచ్చటగా కనిపిస్తాయి. ఈ నెలలో ఒక్కసారైనా మైదాకు పెట్టుకోవాలని పెద్దలు అంటారు. అంతేకాదు బాగా పండితే మంచి భర్త దొరుకుతాడు అని చెప్తారు. అయితే ఈ నెలలోనే పెట్టుకోవడానికి ముఖ్యమైన కారణం ఉంది. అదేంటంటే... బాగా వర్షాలు పడడంతో వాతావరణం పూర్తిగా మారిపోతుంది.

 వర్షంతో స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. మైదాకుపెట్టుకుంటే అయితే మైదాకు అనగానే నేటి తరం ఆడపిల్లలు చాలా మందికి గుర్తుకొచ్చేది కోన్స్.. ఆర్టిఫిషియల్ కలర్స్ మాత్రమే. ఆ రంగుల మాయలో పడి మైదాకును మరిచిపోతున్నారు. అలాంటి వాళ్లకు తెలియచెప్పేందుకే కొన్ని పట్టణాల్లో మైదాకు పండుగలు చేస్తున్నారు. అందరూ కలిసి మైదాకు కోసుకొచ్చి నూరి, పెట్టుకుంటున్నారు.
 

 గ్రామాల్లో ఉండే ఆడవాళ్లు ఆషాఢ మాసంలో ఉదయం లేచింది మొదలు పొలాల్లోనే ఉంటారు. నారుమళ్లలో పని చేసేటప్పు డు ఎక్కువసేపు బురదలోనే ఉండాల్సి ఉంటుంది. అలాంటి టైంలో బురద వల్ల కాళ్ల గోళ్లు దెబ్బతింటాయి. స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. కాళ్లు ఎక్కువ సేపు నీళ్లలో నానడం వల్ల మంటలు పుడతాయి. మైదాకు పెట్టుకోవడం. వల్ల ఇలాంటి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

ఆయుర్వేదంలో కూడా..

మైదాకు మంచి మెడిసిన్ అని ఆయుర్వేదం లో చెప్పారు. ఆకుల్లో మాత్రమే కాకుండా పూలు, వేళ్లు, బెరడు, విత్తనాలు, గింజల్లో కూడా ఔషధ గుణాలు ఉంటాయి. మైదాకు చెట్ల పూలు సువాసన వెదజల్లుతాయి. అందుకే వాటిని అత్తరు తయారీలో ఎక్కు వగా వాడతారు. సూరిన మైదాకులో కాస్త నిమ్మరసం కలిపి అరికాళ్లకు పెట్టుకుంటే మంటలు, నొప్పులు తగ్గుతాయి. మైదాకు శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అందుకే ఆషా ఢంలోనే కాదు అన్ని శుభకార్యాలప్పుడూ మైదాకు పెట్టుకోవాలని పెద్దలు చెప్తుంటారు. అరచేతులకు మైదాకు పెట్టుకుంటే శరీరం లోని వేడిని నియంత్రిస్తుంది.
 
సంప్రదాయం

మన సంప్రదాయంలో శ్రావణ, కార్తీక మాసాలు శుభప్రదమైనవి. పెళ్లిళ్లు, పేరంటాలు ఎక్కువగా ఉంటాయి.. మైదాకు బాగా పండాలని అందులో కాను, చింతపండు, నిమ్మరసం కలుపుతుంటారు. కొత్తగా పెళైన అమ్మాయిలు ఆషాఢంలో అత్తగారింట్లో ఉండకూడదు అంటుంటారు. వాళ్లకు ఆషాఢం అంటే హాలీడేస్ ఇచ్చినట్టే. పుట్టింటికి వెళ్లి, అక్కడ ఉండే స్నేహితులను కలుసుకుంటారు. వాళ్లంతా కలిసి కబురు చెప్పుకుంటూ మైదాకు తెంపుకొచ్చి రోట్లో నూరుతారు. 

దాన్ని రాత్రిభోజనం చేశాక, అందరూ కలిసి ఒక చోట కూర్చుని రకరకాల డిజైన్లు పెట్టించుకుంటారు. మైదాకులో ఉండే లాహోసోనే అనే రసాయనం (పిగ్మెంట్) వల్ల
అరచేతులు, పాదాలు ఎర్రగా మారుతాయి. తల్లిగారింట్లో ఉన్న అమ్మాయి మైదాకు పెట్టుకుంటే భర్త ఆరోగ్యంగా ఉంటాడనే నమ్మకం కూడా ఉంది. మైదాకును గుజరాత్, రాజస్తాన్, మహారాష్ట్రల్లో కూడా చాలా మంది పెట్టుకుంటారు. 

కోన్లు ఓకేనా?

ఆషాఢంలో మైదాకు పెట్టుకొమ్మన్నారు కదా అని చెప్పి కొందరు ఆర్టిఫిషియల్ తయారు చేసిన మెహిందీ (కోస్లు) వాడతారు. కొన్ని రకాల కోన్లలో రంగు కోసం రసాయనాలు కలుపుతారు. దీని వల్ల చర్మం ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒక్కోసారి అలర్జీలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల మైదాకు నూరి పెట్టుకోవడమే మంచిది. మైదాకు పండింది అరచేతి నిండా 

ప్రతి ఇంట్లో 

పల్లెల్లో ప్రతి ఇంట్లో తులసి, కరివేపాకు మొక్కలు ఎలా ఉంటాయో. మైదాకు చెట్లు కూడా అలాగే ఉంటాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో దీన్ని మైదాకు చెట్టు అని పిలుస్తుంటారు. దీన్ని నాటడానికి, పెంచటా నీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా చెట్టు కనిపిస్తే దాని కొమ్మ తీసుకొచ్చి పెడితే చాలు. చక్కగా పెరుగుతుంది. కోస్ల వినియోగం బాగా పెరగడం వల్ల ఈ మొక్కల ను పెంచేవాళ్లు తక్కువయ్యారు. 

అందుకే హరి తహారం కార్యక్రమంలో భాగంగా చాలా చోట్ల రోడ్ల పక్కన మైదాకు మొక్కలు నాటించారు. మైదాకు ఏడాదంతా దొరుకుతుంది. కానీ.. వా నాకాలంలో ఎక్కువగా చిగురిస్తుంది. మైదాకు చెట్లు పచ్చని ఆకులతో కళకళలాడుతాయి. అందుకే ఈ టైంలో మైదాకు కోసినా.. చెట్లు మళ్లీ తక్కువ టైంలోనే గుబురుగా లేస్తాయి.

మైదాకు పండుగ

పల్లెలు పట్నాలు అవుతున్నాయి. ఫ్యాషన్ పేరిట సంస్కృతి కనుమరుగువుతోంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఈ సంప్రదా యాన్ని కాపాదాలనే ఉద్దేశంతో 'మైదాకు పండుగలు' చేస్తున్నారు. ఆనాటి తీపి గుర్తులను నెమరేసుకుంటు న్నారు. కరీంనగర్ తో పాటు హుజురాబాద్, జమ్మికుంట, హుస్నా బాద్, జగిత్యాల, గోదావరిఖని లాంటి చాలా ప్రాంతాల్లో మహిళలంతా ఒక దగ్గరకు చేరి మైదాకు పండుగ చేసుకుంటున్నారు. కరీంనగర్లో కొన్ని అపార్టమెంట్లలో అయితే ఒక రోజు ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకుని, కొత్త చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని ముస్తాభై... ఈ వేడుకలు జరుపుతున్నారు. అందరూ కలిసి మైదాకు కోసుకొచ్చి. నూరి అందంగా పెట్టుకుంటున్నారు.