భారత్లో 30 శాతం మందికి బీపీ లేదు: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: రక్తపోటు..ఇప్పుడు తరుచుగా వింటున్న మాట..డాక్టర్ల దగ్గరకు వెళితే మొదటగా అడిగే ప్రశ్న మీకు బీపీ ఉందా అని.. ఇటీవల  రక్తపోటు గురించి ICMR, NCDIR  తమ అధ్యయనాల్లో ఆసక్తికర విషయాలను బయటపెట్టాయి. 


భారతదేశంలోని ప్రతి 10 మందిలో ముగ్గురు 18 నుంచి 54 ఏళ్ల మధ్య వయసుగల వారు ఇప్పటివరకు రక్తపోటును చెక్ చేయించుకోలేదని ఐసీఎంఆర్ తెలిపింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో ఇటీవల ప్రచురించిన ఓ అధ్యయనంలో ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డీసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ కలిసి రూపొందించిన నివేదికలో పేర్కొంది. 

 ICMR, NCDIR  అధ్యయనం ప్రకారం.. దేశంలోని దక్షిణ ప్రాంతాల్లో అత్యధికంగా సగటున 76 శాతం మంది తమ జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా రక్తపోటును చెకప్ చేయించుకున్నారు. లక్ష ద్వీప్ -91శాతం, కేరళ -89 శాతం, తమిళనాడు 83 శాతం రక్తపోటు చెకప్ చేయించుకున్నారు. 

ఉత్తర భారత దేశంలో 70 శాతం మంది ప్రజలు తమ రక్తపోటును ఒకసారి లేదా రెండు సార్లు పరీక్షించుకున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్, నాగాలాండ్  వంటి  ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలలో తక్కువ సంఖ్యలో వారి బీపీ తనిఖీ చేసుకున్నారు. 

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (AHA) ప్రకారం.. హై బ్లడ్ ప్రెజర్ అంటే.. ధమనుల్లో ఉండాల్సిన దానికంటే ఎక్కవ ఒత్తిడి కలిగి ఉండటం. ఇది హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సీరియస్ ఆనారోగ్యాలకు దారి తీస్తుందని డాక్టర్లు అంటున్నారు.