సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  నివాసాన్ని ఖాళీ చేశారు.  అక్టోబర్ 4న ఉదయం  తన కుటుంబంతో సహా సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు.  కేజ్రీవాల్ ఆయన సతీమణి సునీత, తల్లిదండ్రులతో కలిసి  6  ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని  ఇల్లును  ఖాళీ చేసి..  ఢిల్లీలోని లుటియన్ ప్రాంతంలో ఉన్న బంగ్లాకు వెళ్లారు.

 గతంలో పంజాబ్ కు చెందిన  ఆప్ రాజ్యసభ ఎంపీ అశోక్ మిట్టల్‌కు కేటాయించిన మండి హౌస్ సమీపంలోని ఫిరోజ్‌షా రోడ్‌లోని 5 లోని బంగ్లాలోకి మారారు. ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్  రాజీనామా చేసిన  సంగతి తెలిసిందే.. కొత్త  సీఎంగా అతిశీ సీఎం పదవి చేపట్టారు. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇటవలే బెయిల్ పై బయటకు  వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2025 ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజల నుంచి తన నిజాయితీ నిరూపించుకున్న  తర్వాతే తాను మళ్లీ పదవికి వస్తానని కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.  2021- 22 ఢిల్లీ లిక్కర్ పాలసీలో అక్రమాలకు సంబంధించి కేజ్రీవాల్ దాదాపు ఆరు నెలల పాటు తీహార్ జైలులో ఉన్నారు.