అయోధ్య బాలరాముడి కళ్లను దేనితో చెక్కారో తెలుసా..

అయోధ్య  బాల రాముడి విగ్రహానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అరుణ్ యోగిరాజ్ వెల్లడించారు. బాల రాముడి దివ్య నేత్రాలను చెక్కిన పనిముట్లను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వెండి సుత్తి, బంగారు ఉలిని చేతిలో పట్టుకుని చూపిస్తూ.. వీటితోనే బాల రాముడి విగ్రహానికి దివ్య నేత్రాలను తీర్చిదిద్దానని తెలిపారు.

 అయోధ్య బాలరామయ్ విగ్రహాన్ని శిల్పి అరుణ్  యోగిరాజ్ ఎంతో అందంగా చెక్కారు.  ప్రస్తుతం అయోధ్య రామయ్య కళ్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  అందంగా నవ్వుతూ విగ్రహాన్ని చెక్కారని భక్తులు మెచ్చుకుంటున్నారు.  కోట్లాది భక్తులు ఇప్పటికే రామ్ లల్లాను దర్శనం చేసుకున్నారు.  తాజాగా బాలరాముడి కళ్లను చెక్కిన వస్తువులను అరుణ్ యోగిరాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  వెండి సుత్తి.. బంగారు ఉలితో అయోధ్య బాలరాముడి కళ్లను తీర్చిదిద్దానని శిల్పి యోగిరాజ్ తెలిపారు.  ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ఈ విషయంపై అరుణ్ యోగిరాజ్ కుటుంబ సభ్యులు స్పందించారు.  తన కుమారుడు తయారు చేసిన రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించి కోట్లాది మంది భక్తులు పూజలు చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని అరుణ్ యోగిరాజ్ తల్లి తెలిపింది.  అయోధ్య బాల రామయ్యకు సంబంధించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.