బీ అలర్ట్ : అరుబా అలో శానిటైజర్లు, స్కిన్ క్రీములు వాడితే కోమాలోకి వెళతారు..

శుభ్రత, పరిశుభ్రతతోపాటు అందంపై రోజురోజుకు మక్కువ పెరుగుతుంది. ఇదే సమయంలో ఆర్గానిక్ ఉత్పత్తులు బెటర్ అని.. ఆరోగ్యం అని చాలా మంది అటువైపు వెళుతున్నారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఎంతో పాపులర్ అయిన అరుబా అలో అనే హ్యాండ్ శానిటైజర్లు, ఫేస్ క్రీములపై చేసిన పరిశోధనల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అరుబా అలో శానిటైజర్లు, ఫేస్ క్రీం ఉపయోగించిన వారిలో.. చర్మ సంబంధ వ్యాధులు, కంటి చూపు మందగించటం వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అంతేనా వీటిని ఎక్కువగా ఉపయోగించిన వారు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ.. అరుబా అలో ఉత్పత్తులను మార్కెట్ నుంచి వెనక్కి తీసుకోవాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్.. ఆ కంపెనీని ఆదేశించింది. జనం ఎవరైనా వాటిని కొనుగోలు చేసి ఉంటే రిటర్న్ చేయాలని.. వాటిని ఉపయోగించొద్దని హెచ్చరించింది. ఈ ఉత్పత్తుల్లో అధిక మోతాదులో ఆల్కాహాల్, మిథనాల్ ఉందని.. దీని వల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రకటించింది. 

2021 మే నెల నుంచి 2023 అక్టోబర్ మధ్య కాలంలో కంపెనీ నుంచి పంపిణీ చేయబడిన అరుబా అలో ఉత్పత్తులను కంపెనీకి రిటర్న్ చేయాలని ఈ మెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చింది అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్. 

2021 మే నెల నుంచి 2023 అక్టోబర్ మధ్య కాలంలో అరుబా అలో శానిటైజర్లు, ఫేక్ క్రీమ్స్ వాడిన వారికి చూపు మసక బారటం, తలనొప్పులు, తల తిరగటం, కిడ్నీ సమస్యలు, నాడీ వ్యవస్థ దెబ్బతినటం, కొన్నిసార్లు శాశ్వతంగా చూపు కోల్పోవటం, మరికొన్ని సందర్భాల్లో కోమాలోకి వెళ్లటం జరుగుతుందని.. దీనికి కారణం ఆయా ప్రాడెక్ట్స్ లో అధిక మోతాదులో ఆల్కాహాల్, మిథనాల్ ఉండటమే అని స్పష్టం చేస్తున్నారు అమెరికా డాక్టర్లు.

శానిటైజర్లలో ఆల్కాహాల్ అనేది కామన్ గా ఉంటుంది.. అయితే అది 60 శాతం మించకుండా ఉండాలని స్పష్టం చేస్తున్నారు డాక్టర్లు. అంతకంటే ఎక్కువ మోతాదులో ఉంటే ప్రమాదకరం అంటున్నారు. అరుబా అలో శానిటైజర్లు, ఫేస్ క్రీముల్లో ఇది 80 శాతం వరకు ఆల్కాహాల్ ఉండటం వల్ల ప్రమాదకరంగా మారాయని స్పష్టం చేస్తున్నారు డాక్టర్లు.