370 రద్దు నిర్ణయం దేవుడిది కాదు

ఎన్సీ లీడర్​ ఒమర్ అబ్దుల్లా

బుద్గామ్: ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం పార్లమెంటుదే తప్ప దేవుడిది కాదని.. కావాలంటే దానిని మార్చుకోగల అవకాశం ఉందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా చెప్పారు. సోమవారం జమ్మూలో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 రద్దు ఒక చరిత్ర అని, ఇకపై భారత రాజ్యాంగంలో భాగం కాదని చేసిన వ్యాఖ్యలపై మంగళవారం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఏదీ అసాధ్యం కాదని పేర్కొన్నారు. "ఇది దేవుడి నిర్ణయం కాదు, పార్లమెంటుది. 

పార్లమెంటు తీసుకున్న ఏ నిర్ణయాన్నైనా మార్చవచ్చు. సుప్రీంకోర్టులోని ఐదుగురు జడ్జిలు రద్దుకు అనుకూలంగా తీర్పిస్తే.. అది సాధ్యం కాలేదా? రేపు ఏడుగురు జడ్జిల బెంచ్ మళ్లీ ఆర్టికల్ 370కి అనుకూలంగా తీర్పు వెలువరిస్తుంది. జమ్మూలో టెర్రరిజం పెరగడానికి ఎవరు కారణమో షా ముందుగా ప్రజలకు చెప్పాలి” అని ఒమర్ అబ్దుల్లా నిలదీశారు.