నార్వే యువరాణి కుమారుడి అరెస్ట్

కోపెన్‌‌హాగన్: ఓ మహిళపై అత్యాచారం చేశారనే ఆరోపణలతో నార్వే యువరాణి మెట్టె-మారిట్ కొడుకు మారియస్ ​బోర్గ్ ​హోయిబీ(27)ని సోమవారం పోలీసులు అరెస్ట్​ చేశారు. రేప్ ఎప్పుడు జరిగిందన్న విషయాన్ని పోలీసులు చెప్పలేదు. కాగా, అత్యాచారం ఆరోపణలతో మారియస్​ బోర్గ్​ హోయిబీ అరెస్ట్​ కావడం ఇది రెండో సారి. ఈ ఏడాది ఆగస్టు 4న కూడా పోలీసులు ఇతడిని అరెస్ట్​ చేశారు. స్లోలోని ఒక మహిళ అపార్ట్‌‌మెంట్‌‌లోకి వెళ్లి రాత్రి సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో బోర్గ్ హోయిబీని అదుపులోకి తీసుకున్నారు. మెట్టే-మారిట్​ నార్వేజియన్ సింహాసనానికి వారసుడైన క్రౌన్ ప్రిన్స్ హాకోన్​ను వివాహం చేసుకోకముందే బోర్గ్ హోయిబీ ఆమెకు జన్మించాడు. అతనికి రాజ బిరుదు గానీ, అధికారిక విధులు గానీ లేవు. అతడు రాజ దంపతులు, వారి పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు.