బోధన్, వెలుగు : బోధన్ మండలం బర్దిపూర్ గ్రామ శివారు ప్రాంతం నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను బోధన్ రూరల్ ఎస్‌ఐ నాగనాథ్ఆదివారం స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ నాగ్ నాథ్ మాట్లాడుతూ.. వారం రోజుల నుంచి బర్దిపూర్, భూలక్ష్మి క్యాంప్ గ్రామ శివారు ప్రాంతాల నుంచి మట్టిని తరలిస్తున్నారని
స్థానిక గ్రామాల ప్రజలు స్థానిక ఎమ్మార్వో గంగాధర్ కు ఫిర్యాదు చేయడంతో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న నాలుగు మట్టి టిప్పర్లను ఆచన్‌పల్లి వద్ద పట్టుకున్నట్లు తెలిపారు. మట్టి తరలింపునకు ఎలాంటి అనుమతులు లేకపోవడంతో బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఏస్సై నాగనాథ్ తెలిపారు.