సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

  •     1100 మంది పోలీసులతో భారీ బందోబస్త్​

వేములవాడ, వెలుగు : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి బుధవారం వేములవాడలో పర్యటించనున్నారు. ఈక్రమంలో సీఎం టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు విప్​ ఆది శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి కేకే మహేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం బహిరంగ సభకు జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. గుడిచెరువులో నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్లను కలెక్టర్​ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝా, ఎస్పీ అఖిల్​ మహాజన్ మంగళవారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1100 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వేములవాడ పట్టణ పీఎస్‌‌‌‌‌‌‌‌లో సిబ్బందికి ఎస్పీ అఖిల్ మహాజన్‌‌‌‌‌‌‌‌ దిశానిర్దేశం చేశారు. బందోబస్త్‌‌‌‌‌‌‌‌ను సెక్టార్లుగా విభజించి అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్థాయి అధికారులను బాధ్యులుగా నియమించారు. సిబ్బంది తమకు కేటాయించిన విధులను అప్రమత్తతతో నిర్వర్తించాలని ఆదేశించారు. 

అంతకుముందు సభా ప్రాంగణాన్ని మల్టీ జోన్‌‌‌‌‌‌‌‌ 1 ఐజీ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి పరిశీలించారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.