కన్నాల గ్రామంలో.. కాల్వకు బుంగ పడి మునిగిన పంటలు

మంథని, వెలుగు: మంథని మండలం కన్నాల గ్రామ శివారులోని ఎస్‌‌ఆర్‌‌‌‌ఎస్పీ డీ83ఎల్‌‌6  కెనాల్ కు ఆదివారం బుంగ పడి పంట పొలాలు నీటమునిగాయి. గుండారం రిజర్వాయర్ నుంచి వచ్చే ఈ కెనాల్‌‌కు బుంగ పడడంతో కన్నాల గ్రామంలో దాదాపు 10 ఎకరాల వరకు పంటలు నీట మునిగాయి. 

ఈ పొలాల్లో నాలుగు రోజుల కిందనే నాట్లు వేయగా కాల్వ నీరు చేరడంతో రైతులు లబోదిబోమంటున్నారు.