మన తెలంగాణాలోనూ డైనోసార్లు తిరిగినాయా.. రాకాసి కోనగా పిలిచేది అందుకేనా..?

ఒకప్పుడు ఎక్కువగా నది ఒడ్డునే గ్రామాలు ఏర్న దేవి. అభివృద్ధి చెందేవి. అలాంటి వాటిలో ఒకటి వేమనవల్లి కొన్ని వందల సంవత్సరాల క్రితం నది ఒడ్డున ఏర్నా జైన గ్రామమే ఇది కూడా. కానీ.. ఈ ప్రాంతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందుకంటే... ఈ ప్రాంతంలో డైనోసార్లు కూడా ఉండేవట. ప్రాణహిత పరపళ్లు, ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కట్టడాలు, ఎంతో విలువైన వృక్షసంపద ఇలా ఎన్నింటినో తన ఒడిలో పదిలపర్చుకుంది ఇన్ని ప్రత్యేకతలున్న వేమనపల్లిపై స్పెషల్  స్టోరీ..

బెల్లంపల్లి వెలుగు : సాధారణంగా అన్ని ఆలయాల ముందు ధ్వజ స్తంభం ఉంటుంది. ఆలయాలకు ఇది చాలా ముఖ్యం. ఈ ధ్వజస్తంభాలు తయారు చేయడానికి 'నారావ' చెట్ల కలప వాడతారు. ఈ చెట్లు ఉత్తర తెలంగాణ మొత్తంలో ఎక్కడా ఉండవు.. ఒక్క వేమనపల్లి మండలంలో మాత్రమే ఈ చెట్లు ఉన్నాయి. వేమనపల్లితో పాటు రాజారం, మంగిసపల్లి, కల్లెంపల్లి, నీల్వాయి, జాజులపేట ఒడ్డు గూడెం గ్రామాల అడవుల్లో ఇవి విస్తారంగా పెరుగుతాయి. వీటిని చూస్తుంటే ఆకాశానికి నిచ్చెన వేసినట్లు కనిపిస్తాయి. కర్ణాటక, వేములవాడ. సిరిసిల్ల, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ధ్వజస్తంభాల కలప కోసం నారాప  చెట్లను తీసుకెళ్తుంటారు.

వేమనపల్లిలోని అడవిలో కొన్ని వేల ఏళ్ల క్రితం డైనోసార్లు( రాక్షస బల్లులు) సంచరించినట్లు ఆర్మీ యాలజిస్టులు చెప్తున్నారు. ఇక్కడ వాటికి సంబంధించిన ఆనవాళ్లు ఎన్నో దొరికాయి. 1984లో మంగెనపల్లి అటవీ ప్రాంతంలో డైనోసార్ అవశేషాలను భూగర్భ, పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. 1.4 మీటధ పొడవు. 5.5 మీటర్ల ఎత్తుండే డైనోసార్ అవశేషాలు ఇక్కడ దొరికాయి. ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని సంపుటం, ఒడ్డుగూడెం, మంగినపల్లి తదితర ప్రాంతాల్లో కూడా రాక్షస బల్లులు అవశేషాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వేమనపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో 50 మీటర్ల వెడల్పుతో పెద్ద గొయ్యి (ప్రారంగం) ఉంది. ఈ గొయ్యిని ఈ ప్రాంత ప్రజలు రాకాసి కోనగా పిలుస్తుంటారు.

వృక్ష శిలాజాలు

వేమనపల్లి మండలంలో ఎన్నో వృక్ష శిబాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒడ్డుగూడెం, సుంపులం, వేమనపల్లి గ్రామాల్లోని వాగులు. వంకల్లో ఎక్కడ పడితే అక్కడ వృక్ష శిలాజాలు కనిపిస్తుంటాయి. కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో దట్టమైన అడవి ఉండేది. కాలక్రమేనా భారీ వర్షాలు కురిసి ప్రాణహిత ఉప్పొంగడంతో మహావృక్షాలు నేలమట్టమయ్యాయి. వాటిపై ఇసుక పొరలు కప్పేశాయి. దీంతో ఆ చెట్లు కొన్ని వందల ఏళ్ల తర్వాత శిలాజాలుగా మారాయి.

Also Read :- తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి నిదర్శనం బతుకమ్మ

దశావతారాలు

రాజారం గ్రామంలో కొలువైన దశావతారాలని గ్రహాలు ఈ ప్రాంత చరిత్రను చెప్తున్నాయి. 17వ శతాబ్దంలో కాకతీయ రాజుల కాలంలో వీటిని చెక్కించినట్టు తెలుస్తోంది. కాకతీయులకు సామంత రాజులుగా ఉన్న వేమన్న నాగన్న, సూడన్న, బ్రహ్మన్న అనే నలుగురు అన్నదమ్ములు దశావతారాల విగ్రహాలను ఏర్పాటు చేయించారు. ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతానికి చేరువలో ఉన్న రాజారంలో శ్రీకృష్ణుడు, కాలభైరవుడు, గౌతమలు ద్దుడు. శ్రీరాముడు, సీతమ్మ, అంజనేయస్వామి, పరశురాముడు మహాగణపతి, కాళింగవర్ధనుడు, కూర్యావకారంలో ఉన్న మహావిష్ణువు విగ్రహాలు ఉన్నాయి. సుమారు 800 సంవత్సరాల కాలం  క్రితం ప్రాణహిత నది ఉప్పొంగి వరద పోటెత్తి వందల మంది చనిపోయారు. ఆ టైంలోనే దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠించేందుకు గుడి కడుతున్నారు. వరద ఎక్కువగా రావడంతో గుడి నిర్మాణం ఆపేశారు. దాంతో దశావతారాల విగ్రహాలు ప్రతిష్ఠించకుండా అలాగే వదిలేశారు.

అన్నదమ్ముల పేరుతో

వేమన్న, నాగన్న, సూరన్న, బ్రహ్మన్నలు వ్యవ సాయ ప్రాముఖ్యత గుర్తించి! పెద్ద పెద్ద  చెరువులు తవ్వించారు. వేమనపల్లి, నాగారం, సూరారం, బొమ్మెన గ్రామాల్లో ఇప్పటికీ అ చెరువులు చెక్కు బెదరకుండా ఉన్నాయి. వీటి కింద రైతులు వందల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆ సామంతరాజుల యాదిలో వేమన్న పేరుతో వేమనపల్లి నాగన్న పేరుతో నాగారం, సూడన్న పేరుతో సూరాడు. బ్రహ్మన్న పేరుతో బొమ్మెన గ్రామాలు ఏర్పాటయ్యా యని  పూర్వికులు  చెప్తుంటారు

దక్షిణం నుంచి ఉత్తరాయణం

ప్రాణహిత నదికి ఎంతో విశిష్టత ఉంది. నది రెండు వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక ప్రాణహిత తీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఈ నదికి మరో స్పెషాలిటీ ఏంటంటే.. దక్షిణం నుంచి ఉత్తరం వైపుకు పారుతుంది. ప్రతి సంత్సరం కార్తీక మాసంలో భక్తులు పెద్ద సంఖ్యలో వేమన పల్లికి వచ్చి ప్రాణహితలో పవిత్ర స్నానాలు చేస్తారు. మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్ నుంచి ఇక్కడికి పర్యాటకులు, భక్తులు వస్తుంటారు.

V6 వెలుగు,లైఫ్