బీరుట్: సిరియాలో ఇటీవల నెలకొన్న పరిణామాలతో ఇరాన్మద్దతున్న మిలిటెంట్గ్రూప్హెజ్బొల్లాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సిరియాను తిరుగుబాటుదారులు ఆక్రమించడంతో అధ్యక్షుడు బషర్ -అల్- అసద్ దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా హెజ్బొల్లా చీఫ్ నయాం ఖాసీం స్పందించారు. సిరియాలో చోటుచేసుకున్న మార్పులతో తాము ఆయుధాలను సరఫరా చేసే మార్గాన్ని కోల్పోయినట్టు చెప్పారు. లెబనాన్కేంద్రంగా ఇజ్రాయెల్‌పై పోరు సాగిస్తున్న హెజ్బొల్లాకు ఇరాన్నుంచి ఇరాక్మీదుగా ఆయుధాల సరఫరా మార్గంగా సిరియా ఉపయోగపడింది.
అయితే, అసద్సర్కారుకు వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు కీలక ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఇందులో ఇరాక్–సిరియా సరిహద్దు కూడా ఉన్నది. దీంతో ఆయుధ సరఫరా నిలిచిపోయింది. దీనిపై నయీం ఖాసిం మాట్లాడుతూ.. సిరియాలో పరిణామాల కారణంగా హెజ్బొల్లా సైనిక సరఫరా మార్గాన్ని కోల్పోయింది నిజమేనన్నారు. భవిష్యత్తులో సిరియాలో కొత్త పాలకులు రావొచ్చని, సాధారణ స్థితి ఏర్పడే మార్గం లేకపోలేదని అన్నారు. ఒకవేళ అది జరగకుంటే తాము కొత్త మార్గాల కోసం అన్వేషిస్తామని తెలిపారు. సిరియా కొత్త ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను శత్రువుగా భావిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
సిరియాలో సాధారణ పరిస్థితికి రెబెల్స్ యత్నం
అధ్యక్షుడు బషర్ అల్అసద్దేశం విడిచి పోయాక సిరియాలో నాయకత్వం ప్రతిష్టంభన ఏర్పడింది. జనం అనుక్షణం భయం భయంతో గడుపుతున్నారు. అయితే, దేశంలో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు రెబెల్స్యత్నిస్తున్నారు. సెక్యూరిటీ కొత్త హెడ్ మేజర్హజ్మా ఆల్ అహ్మద్.. సిరియా రాజధాని డమాస్కస్‌కు చేరుకున్నారు. డమాస్కస్ విమానాశ్రయంలో పని కోసం వచ్చిన కొద్దిమంది మెయింటెనెన్స్ కార్మికులు ఆయన చుట్టూ గుమికూడారు. అసద్పాలనలో ఎదుర్కొన్న వివక్షను ఆయన ముందుంచారు. కాగా, వారందరికీ మేజర్ హజ్మా ఆల్అహ్మద్భరోసా కల్పించారు. కాగా, అసద్ దేశం విడిచి వెళ్లిన వారంలోనే
తిరుగుబాటుదారులు చార్జ్తీసుకున్నారు.