ఆర్మూర్‌‌‌‌‌‌‌‌లో ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మించాలి : పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్​మోడల్​స్కూల్​నిర్మించాలని, వారం రోజుల్లో ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఆమరణ దీక్ష చేస్తానని ఆర్మూర్​ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు బహిరంగ లేఖ రాశారు.  ఆర్మూర్ నియోజకవర్గంలో దీక్ష చేయడానికి అనుమతి ఇవ్వాలని డీజీపీని కోరుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. 

Also read :  వైన్ షాప్‌లో స్టఫ్ ఫ్రీగా ఇవ్వాలని.. కత్తితో బెదిరించారు

ఆర్మూర్​అభివృద్ధి కోసం పోరాటాలు చేయడానికైనా సిద్ధమన్నారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా రెండు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లు సౌత్ తెలంగాణకే కేటాయించి నార్త్ తెలంగాణకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.