అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష

ఆర్మూర్, వెలుగు: అభివృద్ధి పనులపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి గురువారం వివిధ శాఖల ఆధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. టౌన్ లోని ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్ లో రెవెన్యూ, మున్సిపల్, ఆర్అండ్​బీ, పంచాయతీరాజ్, మండల పరిషత్​అధికారులతో వేర్వేరుగా అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. 

అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని  అధికారులను ప్రశ్నించారు.  సమీక్షలో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, మున్సిపల్ కమిషనర్ రాజు, తహసీల్దార్​గజానన్, ఎంఈవో పింజ రాజగంగారాం తదితరులు పాల్గొన్నారు.