మున్సిపల్​ అక్రమాలపై విచారణ జరిపించాలి

  • ఆర్మూర్ మున్సిపాలిటీ ఎదుట ధర్నా, వినతిపత్రం అందజేత 

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్​మున్సిపల్​పరిధిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీవో ఆఫీస్​ ముందు ధర్నా చేసి ఆర్డీవో రాజాగౌడ్‌‌‌‌‌‌‌‌కు మెమోరాండం అందజేశారు.  బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. ఆర్మూర్​, పెర్కిట్​, కోటార్మూర్, మామిడిపల్లిలో ఇరిగేషన్, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు కబ్జా చేశారని, వీటికి మున్సిపల్​అధికారులు ఇంటి నంబర్లు కేటాయించారని ఆరోపించారు. ప్రభుత్వ, ఇరిగేషన్ స్థలాలను ఆక్రమిస్తున్నా మున్సిపల్​ అధికారులు తమకేమి పట్టనట్లుగా పర్మిషన్లు ఇస్తున్నారని విమర్శించారు.  

స్థలాలకు కబ్జా చేస్తున్న  వారికి సహకరిస్తున్న అధికారులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్​ఫ్లోర్​ లీడర్​ జీవీ నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధులు కలిగోట గంగాధర్, జెస్సు అనిల్, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్​ ద్యాగ ఉదయ్. కిసాన్ మోర్చా, బీజేపీ, బీజైవైఎం నాయకులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.