ప్రజలకు సౌకర్యాలు కల్పించాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి

ఆర్మూర్, వెలుగు: ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి అన్నారు. గురువారం అర్ధరాత్రి ఆయన ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్, వందపడకల ఆస్పత్రిని  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులు, అందుబాటులో ఉన్న ఆర్టీసీ అధికారులో ఎమ్మెల్యే మాట్లాడారు. అన్ని రూట్లలో బస్సు సౌకర్యాలు కల్పించాలని, పండుగ సమయాల్లో హైదరాబాద్ కు ఎక్కువ బస్సులు నడిపించాలని సూచించారు.

అనంతరం ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేసి డ్యూటీ రిజిస్టర్​ను పరిశీలించారు. ఒకరిద్దరు డ్యూటీలో కనిపించకపోవడంపై ఆరా తీశారు. రూల్స్ ప్రకారం డ్యూటీలో ఉండాల్సిన వారు ఆస్పత్రిలో ఖచ్చితంగా డ్యూటీ చేయాలన్నారు. ఇన్​పేషంట్స్ తో  మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకోవాలన్నారు. హెల్త్ మినిస్టర్ తో మాట్లాడి ఆస్పత్రికి అవసరమైన మిషనరీ, మందులు సరఫరా, స్టాఫ్ నియామకం పూర్తి చేయాలని కోరుతామన్నారు.