మద్యం మత్తులో గొడవ.. దోస్త్​ హత్య

 నిజామాబాద్, వెలుగు: ఇద్దరు ఫ్రెండ్స్ తాగిన మైకంలో గొడవపడి కొట్టుకోగా ఒకరు చనిపోయారు. నిజామాబాద్​లోని చంద్రశేఖర్​నగర్ కాలనీలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. జలీల్​ఖాన్, నర్సింగ్ ఇద్దరు స్నేహితులు. కలిసి మందు పార్టీ చేసుకున్నాక రోటీ కోసం షాప్​కు వెళ్లారు. ఇద్దరి మధ్య గొడవ జరగ్గా నర్సింగ్​ పదునైన ఆయుధంతో జలీల్​ఖాన్ తలపై కొట్టగా తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు.