Health Tips: మీ కాలేయం ప్రమాదంలో ఉందని చూపే..ఐదు లక్షణాలు

కాలేయం..మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం.ఇది శరీరంలోని చెత్తను తొలగిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రక్త కణాల నిర్మాణంలో కీలకంగా పనిచేస్తుంది. మొత్తంగా మన జీవించేందుకు ముఖ్యమైన పనులను నిర్వర్తిస్తుంది కాలేయం.. అటువంటి కాలేయం ప్రమాదంలో పడితే... ఊహించుకుంటేనే భయంగా ఉంది కదా.. మీ కాలేయం చెడిపోయే స్థితిలో ఉంది అని నిర్ధారించే లక్షణాల గురించి తెలుసుకుందాం.. అలాగే కాలేయం చెడిపోకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.

Also Read :- ఈ ఐ డ్రాప్స్ మందును నిషేధించారు..ఎవరూ కొనొద్దు..!

కాలేయం దెబ్బతింటుందని ఎలా తెలుస్తుంది..? 

మనం పడుకున్నప్పుడు ముఖ్యంగా రాత్రి పూట ఈ లక్షణాలు కనిపిస్తే.. కాలేయం ప్రమాదంలో ఉందని గుర్తించాలి. రాత్రిపూట పదేపదే మేల్కొంటున్నారా.. లివర్ డ్యామేజీ  అవడం కూడా నిద్ర సంబంధిత సమస్యలకు ఒక కారణం అంటున్నారు నిపుణులు.  

శరీరంపై దురద రావడం: కాలేయం సరిగా పనిచేయనప్పుడు పైత్యం స్థాయిలు పెరుగుతాయి. ఇవి చర్మంలో దురదలు తెప్పిస్తాయి. శరీరంపై దురద రావడం కూడా లివర్ డ్యామేజీకి సంకేతం. 

కాళ్లలో వాపు: కాలేయం దెబ్బతినడం వల్ల పాదాలు, చీలమండలంలో వాపు రావచ్చు. ప్రత్యేకంగా రాత్రి పూట చీలమండలంలో వాపు కనిపిస్తే కూడా కాలేయం ప్రమాదంలో ఉన్నట్లే అంటున్నారు. 

Also Read :- వామ్మో.. ఎండు కొబ్బరి తింటే ఇన్ని ఉపయోగాలా

రాత్రిపూట వాంతులు: కాలేయం సరిగా పనిచేయకపోతే సంభవించే లక్షణాల్లో రాత్రిపూట వాంతులు కూడా ఒకటి.  రాత్రిపూట వికారం, వాంతులు అవుతున్నట్లయితే తప్పకుండా చెక్ చేసుకోవాలంటున్నారు వైద్యులు. 

మూత్రం పసుపు పచ్చగా వస్తే:మూత్రం పసుపు పచ్చ రంగులో వస్తే కూడా కాలేయం సమస్యలున్నట్లే అని డాక్టర్లు చెబుతున్నారు. 

కాలేయ వ్యాధులకు కారణాలు..

అతిగా మద్యం సేవించడం, వైరల్ హెపటైటిస్, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, కొన్ని టాబ్లెట్ల వల్ల కలిగే సైడ్ ఎఫెక్స్ కారణంగా కాలేయం క్రమక్రమంగా దెబ్బతింటుంది. 

కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే 

సమతుల్య ఆహారం తీసుకోవాలి.. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.