ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..

ఎండలు మండిపోతున్నాయి..వేడిమి, ఉక్కపోతతో డీహైడ్రేషన్ అయితోంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడంలేదు..డీహైడ్రేషన్ లో ఆనారోగ్యం  పాలవకుండా కాపా డేందుకు ప్రకృతి ఇచ్చిన  కొబ్బరి నీళ్లు ఎంతో ఉపయోగకరం. ఉదయాన్నే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎండ వేడిమి ఎక్కువగా ఉంటే వేసవికాలంలో కొబ్బరి నీళ్లు తాగడంఎంతో మంచిది..అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు అస్సలు తాగొద్దంటున్నారు డాక్టర్లు.

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మేలు అని అందరికి తెలుసు.. ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడేందుకు సాయపడతాయి. అయితే కొందరికి ఈ కొబ్బరినీళ్లు మంచిదికాదు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, ఎలర్జీవంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలని డాక్టర్లు అంటున్నారు.