ఉచిత నోట్ బుక్స్​ కోసం దరఖాస్తు చేసుకోండి

ఆర్మూర్, వెలుగు : క్షత్రియ సమాజ్ కు చెందిన విద్యార్థినీవిద్యార్థులు ఉచిత నోట్ బుక్స్​కోసం ఈనెల 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆర్మూర్ క్షత్రియ యువజన సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు సాత్ పుతే సంతోష్, దుమాని నీరజ్ తెలిపారు. ఉచిత నోట్ పుస్తకాల దరఖాస్తు ఫారాలను సోమవారం ఆర్మూర్ లోని లక్ష్మీనారాయణ మందిరంలో ఆవిష్కరించారు.

అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 10 నుంచి ఒంటివరకు, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు దరఖాస్తు ఫారాలను ఇస్తామని చెప్పారు. ఈనెల 23న ఉచిత పుస్తకాల పంపిణీ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో క్షత్రియ సమాజ్ అధ్యక్ష కార్యదర్శులు రెడ్డి ప్రకాశ్

బారడ్ గంగా మోహన్, యువజన సమాజ్ కోశాధికారి కర్తన్ విశాల్, ఉపాధ్యక్షుడు రెడ్డి శ్రీకాంత్, విద్యాశాఖ కార్యదర్శి గుండు క్రాంతి కుమార్, సభ్యులు బచ్చేవాల్ వేణు, చౌల్ దుర్గాదాస్, బచ్చేవాల్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.