గణేశ్ మండపాలకు ఆన్‌‌లైన్ అప్లికేషన్స్.. ఆగస్ట్ 27 నుంచి ఈ సైట్‌లో దరఖాస్తులు

  • పోలీస్‌‌ వెబ్‌‌సైట్స్‌‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • మండపం, నిమజ్జన తేదీ, రూట్స్‌‌ వివరాలు ఇవ్వాలి    
  • ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాండ్స్‌‌లో ఎన్‌‌ఓసీ మస్ట్  
  • రెసిడెన్స్, అపార్ట్‌‌మెంట్స్‌‌లో అనుమతి అవసరం లేదు 

హైదరాబాద్‌‌,వెలుగు: గ్రేటర్ సిటీలో గణేశ్ ​నవరాత్రి ఉత్సవాలకు పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విగ్రహ మండపాల ఏర్పాటు దగ్గర్నుంచి నిమజ్జనం ముగిసేంత వరకు తీసుకోవాల్సిన అనుమతులు, పోలీస్ సేవలకు సంబంధించి విధివిధానాలను రూపొందించారు. మంగళవారం నుంచి వచ్చే సెప్టెంబర్‌‌‌‌ 6వ తేదీ వరకు ఆన్‌‌లైన్‌‌లో అప్లికేషన్స్‌‌ స్వీకరించనున్నారు. ఇందుకు సంబంధించిన గైడ్‌‌లైన్స్‌‌ను సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆదివారం విడుదల చేశారు. పబ్లిక్ ప్లేసెస్‌‌లో మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు స్థానిక ఏసీపీ వద్ద అనుమతులు తీసుకోవాలని సూచించారు.

పోలీస్‌‌ వెబ్‌‌సైట్స్‌‌లో అప్లికేషన్‌‌ 

పోలీస్ వెబ్‌‌సైట్‌‌ అప్లికేషన్స్‌‌లో పేర్కొన్న విధంగా సంబంధిత సర్టిఫికెట్స్‌‌ను అప్‌‌లోడ్‌‌  చేయాలి. మండపాల ఏర్పాటు నిమజ్జనాల సమయంలో ఊరేగింపు స్థానిక పోలీసులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా స్థానిక పోలీసులతో మండప నిర్వాహకులు, స్థానిక నాయకులు, మైత్రి మెంబర్స్‌‌ కో ఆర్డినేషన్‌‌తో పని చేయాలని తెలిపారు. ఆన్‌‌లైన్‌‌ దరఖాస్తులో సమస్యలు తలెత్తితే 8712665785 ఫోన్‌‌ నంబర్‌‌‌‌ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.

Also Read:-‘హైదరాబాద్ మనది.. హైడ్రా మనందరిదీ’

ఇవి మస్ట్ గా పాటించాలి:

  • మండపాల ఏర్పాటుకు సెప్టెంబర్‌‌‌‌ 6వ తేదీ లోగా మస్ట్ గా అప్లై చేసుకోవాలి. 
  • www.hyderabadpolice.gov.in, www .policeportal.tspolice.gov.in  పోలీస్ వెబ్‌‌సైట్‌‌లో అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి. 
  • మండపాలు ఏర్పాటు చేసే ప్రాంతం, తేదీ, సమయం, నిమజ్జనానికి వెళ్లే రూట్, దూరానికి సంబంధించి వివరాలు తెలుసుకోవచ్చు. 
  •  ప్రభుత్వ,ప్రైవేట్‌‌ స్థలాల్లో మండపాలు ఏర్పాటు చేస్తే సంబంధిత వ్యక్తులు ఎన్‌‌ఓసీ మస్ట్ గా తీసుకోవాలి. 
  • ట్రాఫిక్‌‌కు అంతరాయం కలిగే ప్రాంతాల్లో మండపాలకు అనుమతి లేదు.
  •  ప్రైవేట్‌‌ రెసిడెన్స్‌‌లో ఏర్పాటు చేసుకునే మండపాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. కాంప్లెక్స్‌‌లోని సెల్లార్స్‌‌లో మండపాలు ఏర్పాటు చేస్తే పోలీస్ క్లియరెన్స్ మస్ట్ గా ఉండాలి.  
  •  మండప ఏర్పాట్లలో ఎలాంటి వివాదాలు ఉన్నా పోలీస్ క్లియరెన్స్‌‌ ఇవ్వరు. 
  • మండపాల వద్ద అనధికారిక ఎలక్ట్రిసిటీకి అనుమతి లేదు. టీజీఎస్‌‌పీడీసీఎల్‌‌ , పోలీసులు ఇచ్చే పర్మిషన్‌‌ లెటర్‌‌‌‌ అప్లికేషన్‌‌తో అటాచ్‌‌ చేయాలి.
  • లౌడ్ స్వీకర్స్‌‌కి నో పర్మిషన్ . నిర్ధేశిత డెసిబుల్స్‌‌తో కూడిన రెండు స్పీకర్స్‌‌ బాక్సులను మాత్రమే వాడాలి. 
  •  రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల మధ్య సమయంలో స్పీకర్స్‌‌ వినియోగించొద్దు.
  • మండపాల వద్ద వలంటీర్స్‌‌ను నియమించాలి. వారిని గుర్తించేందుకు ఐడీ కార్డులు, బ్యాడ్జిలు ఇవ్వాలి. పబ్లిక్‌‌ను ఆర్డర్‌‌‌‌లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి.
  • హరతి, లైటింగ్ ల్యాంప్స్ కారణంగా అగ్నిప్రమాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.