భారత్లో యాపిల్ ఆదాయం రూ.50వేల కోట్లు..

భారత్ లో యాపిల్ బాగా సంపాదిస్తోంది. దేశంలో దీని ఆదాయం గణనీయంగా పెరిగింది. 2023  సంవత్సరంలో కంపెనీ లాభాల మార్జిన్ 76.4 శాతం పెరిగింది. అంతేకాదు ఈ ఏడాది యాపిల్ ఆదాయం రూ. 50 వేల కోట్లు. 

బెంగళూరులో Apple India Pvt  ప్రధాన కార్యాలయం ఉంది. గతేడాది రూ. 33,381.3 కోట్లు ఆదాయం ఉండగా 2023 ఫైనాన్షియల్ఇయర్ లో రూ. 49,321.8 కోట్ల ఆదాయ గణాంకాలను నమోదు చేసింది.
iPhone, i Pad, Mac వంటి ఐకానిక్ డివైజ్ ల అమ్మకం ద్వారా Apple కు దాదాపు 94.6 శాతం ఆదాయం వస్తుంది.  మిగిలిన 5.4 శాతం దాని ఆపిల్ కేర్ బీమా ప్రోగ్రామ్ నిర్వహణ అందించే సేవల ద్వారా వస్తుంది.  పెరిగిన కొత్త పరికరాల అమ్మకంతో యాపిల్ మరింత అనుకూలమైన లాభాలను అందిస్తున్నాయి. అంతేకాదు గత ఆర్థిక సంవత్సరంలో కాంపోనెంట్ లలో ఖర్చు తగ్గింపులు ఆర్థిక విజయానికి దోహదం చేస్తున్నాయి. 

ALSO READ :- మంత్రి సబితా వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు.. ఆమె పర్సును కూడా వదల్లేదు