కొత్తగా 4 మోడల్స్తో యాపిల్ ఐఫోన్16 సిరీస్ లాంచ్..ధర, ఫీచర్లు ఇవిగో..

iPhone 16 ఫోన్ ను గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసింది యాపిల్ కంపెనీ. ప్రస్తుత పోటీ మార్కెట్లో తన హవా కొనసాగించేందుకు Gen AI ఆపిల్ ఇంటెలిజెన్స్ తో ఇట్స్ గ్లోటైమ్  ఈవెంట్ తన కొత్త ఐఫోన్16 సిరీస్ ను రిలీజ్ చేసింది. వాటిలో ఐఫోన్ 16 సిరీస్ లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్,ఐఫోన్ 16 ప్రో,ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లు ఉన్నాయి.    

ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో యాపిల్ కొత్త యాపిల్ ఇంటెలిజెన్స్ ను పరిచయం చేసింది.  ఐఫోన్ 16, ఐఫోన్ ప్రో మోడల్స్ రెండింటిలో యాపిల్ ఇంటెలిజెన్స్ ను వినియోగించారు. A18 నే చిప్ ను వినియోగించడం ద్వారా ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు 17 శాతం ఎక్కవు బ్యాండ్ విడ్త్ తో అప్ గ్రేడ్ చేయబడిన మెమరీ సబ్ సిస్టమ్ ఉంటుంది. మునుపటి సిరీస్ లకంటే 30 శాతం ఎక్కువ స్పీడ్ తో పనిచేస్తాయి. 

ఐఫోన్ 16 సిరీస్ నాలుగు మోడళ్ల ధరలు

iPhone 16 Pro 

256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1లక్షా29వేల 900 లు
512GB , 1TB వేరియంట్‌ల ధర వరుసగా రూ. 1లక్షా49వేల 900 , 1లక్షాల 69వేల 900.

iPhone 16 Pro Max

iPhone 16 Pro Max ఐఫోన్  ధర 
512GB స్టోరేజ్ ఆప్షన్‌కు రూ.1 లక్షా64వేల 900 
1TB స్టోరేజ్ ఆప్షన్‌కు రూ.1లక్షా 84వేల 900 

iPhone 16   ధర 

ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 67వేలు అయితే ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 75వేల 500) 
iPhone 16 Pro ధర 128GBకి  రూ. 83వేల 870
iPhone 16 Pro Max 256GB కోసం రూ. 1 లక్ష నుంచి ప్రారంభమవుతుంది. 

భారతదేశంలో ఐఫోన్ 16 ధర రూ. 79వేల 900 ఉండగా.. iPhone 16 + రూ. 89వేల900 ధరకు అందుబాటులో ఉంటుంది. 

iPhone 16 Proప్రారంభ ధర రూ. 1లక్షా19వేల 900తో వస్తుంది. అత్యంత ప్రీమియం iPhone 16 Pro Max, భారతీయ మార్కెట్లో మీకు రూ. 1లక్షాల 44వేల 900 అవుతుంది.

అయితే Apple iPhone 16 సిరీస్ విడుదల చేసిన తర్వాత అయితే Apple iPhone 14, 15 సిరీస్ ధరలు తగ్గించి యాపిల్ కంపెనీ.  ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ తర్వాత ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15 , ఐఫోన్ 15 ప్లస్‌లపై శాశ్వత ధర తగ్గింపును యాపిల్ ప్రకటించింది.