Apple intelligence అప్డేట్స్: ఇకనుంచి మీ ఐఫోన్ పనిచేయాలంటే ఈ ఫీచర్స్ ఉండాల్సిందే..!

లోయర్, మిడిల్, అప్పర్ క్లాస్.. ఇలా క్లాసేదైనా అందరూ కోరుకునే బ్రాండ్ యాపిల్ ఫోన్. మార్కెట్ లో డామినేషన్ కొనసాగించేందుకు ఎప్పటికప్పుడు సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేస్తూనే ఉంటుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఫీచర్స్ మార్చడంలో యాపిల్ ముందుంటుంది. 

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న వేళ యాపిల్ కొత్త ఫీచర్ ‘యాపిల్ ఇంటలిజెన్స్’ పేరున తీసుకొచ్చింది. అయితే తాజాగా యాపిల్ ఇంటలిజెన్స్ కు అప్ డేట్ గా కొత్త ఫీచర్స్ ను రిలీజ్ చేసింది. యాపిల్ ఇంటలిజెన్స్ సెకండ్ బ్యాచ్ కింద iOS 18.2, iPadOS 18.2, macOS Sequoia 15.2 పేరున iPhones, iPads, Macs కోసం కొత్త ఫీచర్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేసింది. 

Also Read : ఫోన్ల కొనుగోలుపై బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీలో కొత్త ఆఫర్లు

అయితే ఈ అప్ డేట్స్ ను ఛాట్ జీపీటీ (OpenAI ChatGPT) కు సపోర్ట్ చేసేలా తీసుకొచ్చింది. దీన్ని ఉపయోగించి ‘సిరి’, రైటింగ్ టూల్స్, ఇమేజ్ ప్లేగ్రౌండ్ తో పాటు ఇంప్రూవ్డ్ రైటింగ్ టూల్స్ కు వర్కౌట్ అయ్యేలా యాపిల్ ఇంటలిజెన్స్ సపోర్ట్ చేయనుంది. 

యాపిల్ ఇంటలిజెన్స్ సపోర్ట్ చేసే డివైజ్లు ఇవే:

  • iPhones: iPhone 15 Pro, iPhone 15 Pro Max, iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max లలో పనిచేస్తుంది.
  • iPads: iPads with A17 chip or M1 chip లతో పాటు తర్వాత వచ్చిన లేటెస్ట్ డివైజ్ లలో పనిచేస్తుంది.

 

  • Macs: Macs with M1 chip లతో పాటు తర్వాత వచ్చిన లేటెస్ట్ డివైజ్ లలో వర్కౌట్ అవుతుంది.

అయితే యాపిల్ ఇంటలిజెన్స్ పనిచేయాలంటే తాజాగా రిలీజ్ చేసిన iOS 18.2, iPadOS 18.2, and macOS Sequoia 15.2. మొదలైన ఫీచర్లు ఉండాల్సిందే. లేదంటే అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.