iPhones: భారీగా తగ్గిన ఐఫోన్ ధరలు.. ఇంత తగ్గడం ఇదే తొలిసారేమో..!

మొబైల్ ఫోన్ల దిగుమతులపై 5 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో టెక్నాలజీ కంపెనీ యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ ధరలపై రూ.5,900 వరకూ తగ్గింపును ప్రకటించింది. బడ్జెట్లో భాగంగా బేసిక్ కస్టమ్స్ డ్యూటీని (BCD) 5 శాతం తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ పరిణామంతో ఐఫోన్ ధరలు కొంతమేర తగ్గనున్నాయి. ఐఫోన్ ఎస్ఈ మోడల్ ధరను రూ.49,900 నుంచి రూ.47,600కు యాపిల్ సంస్థ తగ్గించింది. 

ఐఫోన్ 15 ప్రో మోడల్ పై రూ.5,100, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్పై 5,900 తగ్గింపును ప్రకటించింది. ఇదిలా ఉండగా.. మన దేశంలో తయారయ్యే మోడల్స్ పై పెద్దగా తగ్గింపును యాపిల్ సంస్థ ప్రకటించలేదు. ఐఫోన్ 15, ఐఫోన్ ప్లస్ మోడల్స్పై 300 రూపాయలు మాత్రమే తగ్గింది. మన దేశంలో తయారయ్యే మొబైల్స్కు బీసీడీ పన్ను శాతం తగ్గడం వల్ల మొబైల్ కంపెనీలకు ఒనగూరే ప్రయోజనం లేదు. బడ్జెట్ కు ముందు, బడ్జెట్ తర్వాత ఐఫోన్ ధరలు ఎంత తగ్గాయో ఈ కింది ఫొటోలో చూడొచ్చు.