Apple Diwali 2024 Sale: ఐఫోన్ ప్రియులకు పండగో.. పండగ: యాపిల్ దీపావళి సేల్ 2024 ప్రకటన

ఈ- కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పండుగ విక్రయాల తర్వాత, టెక్ దిగ్గజం యాపిల్(Apple) తమ దీపావళి సేల్ 2024 తేదీని ప్రకటించింది. అక్టోబర్ 3, 2024 నుండి ఈ సేల్ షురూ కానుంది. ఈ సేల్‌లో iPhoneలు, MacBooks, Apple Watchలు సహా అన్ని రకాల యాపిల్ ఉత్పత్తులపై ఆకట్టుకునే డీల్స్, డిస్కౌంట్‌లు ఉండనున్నాయి. 

యాపిల్ ప్రోడక్టులు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు ధరను మరింత తగ్గించడానికి ట్రేడ్-ఇన్ సౌకర్యం, బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఫెస్టివ్ సేల్ కింద సరికొత్త డివైజ్‌లపై కంపెనీ భారీ డిస్కౌంట్లను ఇవ్వనుందని తెలుస్తోంది. ఐఫోన్ 16 సిరీస్, మ్యాక్‌బుక్, వాచ్ 10 సిరీస్‌లు చౌకగా సొంతం చేసుకోవచ్చు. Apple వెబ్‌సైట్, Apple స్టోర్‌లలో సేల్ ప్రారంభం కానుంది.

ALSO READ | Samsung Galaxy Tab S10 సిరీస్‌ వచ్చేసింది..AI ఫీచర్లతో..వివరాలివిగో

ప్రయోజనాలు

యాపిల్ వెబ్‌సైట్ ప్రకారం, ఆసక్తిగల కొనుగోలుదారులు ఈ క్రింది ప్రయోజనాలు పొందవచ్చు.

నో కాస్ట్ EMI: కొనుగోలుదారులు ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై 6 నెలల వరకు నో కాస్ట్ EMIతో తక్కువ నెలవారీ వాయిదాలను ఎంచుకోవచ్చు.

ఎక్స్‌చేంజ్: కొనుగోలుదారులు తమ పాత యాపిల్ ప్రొడక్టులను ట్రేడ్-ఇన్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. తద్వారా కొత్త కొనుగోళ్లుపై తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

యాపిల్ మ్యూజిక్: యాపిల్ ఉత్పత్తులు కొనుగోలు చేసిన వారు 3 నెలల పాటు Apple Musicను ఉచితంగా పొందవచ్చు.

రూ. 39,999కే ఐఫోన్ 13: 

ఒకవేళ కొనుగోలుదారులు ఎవరైనా  ఐఫోన్‌ 13 కోసం చూస్తుంటే అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. సేల్‌లో భాగంగా ఐఫోన్‌ 13పై అమెజాన్ ధరను రూ.41,999కి తగ్గించింది. అంతేకాదు, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు అదనంగా రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు. తద్వారా రూ. 39,999కే సొంతం చేసుకోవచ్చు. ఇది మంచి ఆఫర్ అని చెప్పుకోవాలి.