AP TET Hall ticket: టెట్ హాల్ టికెట్ విడుదల - డౌన్లోడ్ చేసుకోండిలా..!

2024 AP  TET పరీక్షకు సంబందించిన హాల్ టికెట్లను పాఠశాల విద్యా విభాగం విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ aptet.apcfss.in ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.ఫిబ్రవరి 27న జరగనున్న ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి 12వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుండి 5వరకు రెండో సెషన్ జరగనుంది. ఈ పరీక్షకు సంబందించిన ఆన్సర్ కీని మార్చ్ 10న రిలీజ్ చేస్తామని, రిజల్ట్ ని మార్చ్ 14న అనౌన్స్ చేస్తామని అధికారులు తెలిపారు. 

AP TET 2024 హాల్ టికెట్ ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

స్టెప్ 1: aptet.apcfss.in అఫీషియల్ వెబ్సైట్ కి లాగిన్ అవ్వండి. 
స్టెప్ 2: హోమ్ పేజీలో AP TET 2024 అడ్మిట్ కార్డు లింక్ మీద క్లిక్ చేయండి.
స్టెప్ 3:డేట్ ఆఫ్ బర్త్, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు లాగిన్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసాక సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి.
స్టెప్ 4: అడ్మిట్ కార్డు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది.
స్టెప్ 5: వివరాలు అన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.
స్టెప్ 6: డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. 

2గంటల 30నిలమిషాలపాటు జరిగే ఈ పరీక్షలో అభ్యర్థులు 150మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 1లో ఐదు సెక్షన్లు, పేపర్ 2లో ఐదు సెక్షన్లు ఉంటాయి