2018 గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ ఏపీ హై కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా రద్దు చేయాలని కోర్ట్ తీర్పునిచ్చింది. ప్రశ్నాపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై పలువురు అభ్యర్థులు వేసిన పిటీషన్ పై విచారణ జరిపిన హై కోర్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాలను పలుమార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్న కోర్ట్, 6వారాల లోగా పరీక్షను తిరిగి నిర్వహించి అభ్యర్థుల ఎంపిక కూడా పూర్తి చేయాలని ఆదేశించింది.
త్వరలోనే APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఉన్న నేపథ్యంలో కోర్ట్ ఇచ్చిన తాజా తీర్పు సంచలనం రేపింది. ఈ నెల 17న జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన హాల్ టికేట్స్ కూడా ఇప్పటికే విడుదల అయ్యాయి. ఉదయం 10 గంటల నుండి 12గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2 గంటల నుండి 4గంటల వరకు పేపర్ 2 పరీక్ష జరగనుంది.