- సమాచారం లేదన్న ఈవో
కొండగట్టు వెలుగు : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 29న జగిత్యాల జిల్లా కొండగట్టుకు రాబోతున్నట్టు సమాచారం. దీంతో ఆయన అభిమానుల హడావిడి మొదలైంది. పవన్ కల్యాణ్‌కు మొదటి నుంచి కొండగట్టు అంజన్న అంటే అపారమైన భక్తి. అందుకే తన ప్రచార రథం వారాహికి ఇక్కడే పూజలు నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు.
గతంలో రెండుసార్లు కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో రాబోతున్నారు. అయితే, ఏపీ డిప్యూటీ సీఎం కొండగట్టు పర్యటనపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు.