GhaatiGlimpse: మహిళ సాధికారతపై క్రిష్ సినిమా.. అనుష్క పాత్ర వేదంని మించి!

అనుష్క- క్రిష్ కాంబినేషన్ అంటే గుర్తొచ్చేది వేదం. ఈ సినిమాలో అనుష్క వేశ్య కనిపించి తెలుగు ఆడియన్స్ని కట్టిపడేసిందనే చెప్పాలి. డైలాగ్స్, లుక్స్, మెస్మరైజింగ్ యాక్టింగ్ ఇలా ప్రతిఒక్కటి వేదంలో చక్కగా కుదిరాయి. ఇక మరోసారి రాబోతున్న ఈ కాంబినేషన్ ఇంకో రెండు దశాబ్దాలు గుర్తుండేలా ఘాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు క్రిష్. వివరాల్లోకి వెళితే.. 

విభిన్న సినిమాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (Krish) టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(AnushkaShetty)తో ఓ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు తనదైన శైలిలో '‘ఘాటి' (GHAATI) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ సినిమాపై అందరి అటెన్షన్ క్రియేట్ చేసారు. ఘాటీ అనగా లోయ అని అర్ధం.

ఇవాళ గురువారం (నవంబర్ 7న) ది క్వీన్ అనుష్క శెట్టి బర్త్డే స్పెషల్గా 'ఘాటి' నుంచి ఉదయం పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో అనుష్క లుక్ స్వీటీ ఫ్యాన్స్ని తెగ ఆకట్టుకుంటోంది.

తాజాగా ఘాటి నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. బాధితురాలి నుంచి క్రిమిన‌ల్‌గా, అనంత‌రం లెజెండ్‌గా ఎలా మారిందో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటూ మేక‌ర్స్ తెలిపారు. అనుష్క ట్రైబ‌ల్ అమ్మాయి పాత్ర‌లో వైల్డ్ లుక్లో కనిపిస్తూ ఇంటెన్స్ పెంచుతోంది. 

Also Read : షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరో

ఘాటి కథ విషయానికి వస్తే:

ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసే ఓ సాధారణ మహిళగా అనుష్క కనిపించనుందట. ఇంకాస్త లోతుగా చెప్పాలంటే.. 'అనుకోని పరిస్థితుల కారణంగా ఒక రొచ్చులో ఇరుకున్న మహిళ.. తన సాధికారికతను చూపించుకోవడానికే ఎలా పోరాడింది..ఆ పోరాటంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది' అనే కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు క్రిష్.