కుందనపల్లి వద్ద రైల్వే ఫ్లై ఓవర్​ నిర్మించాలి : అనుమాస శ్రీనివాస్‌‌‌‌

  • పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు వినతి

గోదావరిఖని, వెలుగు: రామగుండం రైల్వే స్టేషన్‌‌‌‌ సమీపంలోని కుందనపల్లి వద్ద ఫ్లైఓవర్​ నిర్మించాలని దక్షిణ మధ్య రైల్వే యూజర్స్‌‌‌‌ కమిటీ మాజీ మెంబర్‌‌‌‌‌‌‌‌ అనుమాస శ్రీనివాస్‌‌‌‌ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ఎంపీని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా కుందనపల్లిలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. స్పందించిన ఎంపీ కుందనపల్లి వద్ద ఫ్లై ఓవర్​ బ్రిడ్జి నిర్మించేలా రైల్వే ఆఫీసర్లతో చర్చిస్తానని హామీ ఇచ్చినట్టు శ్రీనివాస్​ తెలిపారు.